టీమిండియా జట్టు దుమ్మురేపుతోంది. తాజాగా వైజాగ్ లో  భారత్,  దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ టెస్ట్ మ్యాచ్ లో  భారత్ 203 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా జట్టును చిత్తు చేసి  విజయ ఢంకా మోగించింది. దీంతో ఆటగాళ్లందరూ సంబరాలు చేసుకున్నారు. కాగా టీమిండియా ఆటతీరుపై ఎన్నో ప్రశంసలు కూడా వచ్చాయి. తొలి టెస్టులోనే 203 పరుగుల  భారీ తేడాతో భారత్ జట్టు విజయం సాధించడంతో క్రికెట్ అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేశారు. 

 

 

 

 

కాగా ఆదివారం భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్  ముగిసింది. కాగా సోమవారం రెండు జట్లు పూనే  నగరానికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్టుకు  చేరుకున్న భారత జట్టుకు ఓ  చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్ పోర్ట్ సిబ్బంది తప్పిదం కారణంగా టీమిండియా ఆటగాళ్లు సహా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వర్షంలో తడవాల్సిన  పరిస్థితి ఏర్పడింది. అయితే సోమవారం పూణెకి  బయల్దేరిన క్రమంలో  ఎయిర్ పోర్ట్ కి  చేరుకునేలోపే భారీ వర్షం కురుస్తుంది. 

 

 

 

 

 ఈ క్రమంలో వైజాగ్ ఎయిర్ పోర్టు లో  ప్లాట్ ఫార్మ్  నెంబర్ 1 వద్ద టీమిండియా క్రికెటర్లు బస్సును అనుమతించాలి . కానీ ఎయిర్ పోర్ట్ సిబ్బంది తప్పిదం కారణంగా భద్రత సిబ్బంది దక్షిణాఫ్రికా క్రికెటర్లున్న బస్సును  అనుమతించారు. ఇక భారత క్రికెటర్లు అందురు  ఉన్న బస్సును  ఫ్లాట్ ఫార్మ్  నెంబర్ 3కు పంపించారు ఎయిర్ పోర్ట్ సిబ్బంది . అయితే ఆ సమయంలో భారీ వర్షం వస్తుండడం ప్లాట్ ఫార్మ్ 3 లో పైకప్పు   లేకపోవడంతో భారత క్రికెటర్లు వారి కుటుంబ సభ్యులు వర్షం లో తడిసి పోయారు . దీంతో తమ లగేజీ లతో ఉన్న ఆటగాళ్లు అసౌకర్యానికి గురయ్యారు. కాగా ఈ విషయమై రోహిత్ శర్మ  ఎయిర్ పోర్ట్  సిఐ ని  ప్రశ్నించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: