దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే సిరీస్ లో  పాల్గొనే టీమిండియా మహిళల జట్టు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది .  ప్రపంచ వన్డే నెంబర్ వన్ బ్యాట్స్ విమెన్ గా  కొనసాగుతున్న టీం ఇండియా ఓపెనర్ స్మృతి మందాన గాయం కారణంగా వన్డే  సిరీస్ నుంచి తప్పుకుంది .  మంగళవారం నెట్  ప్రాక్టీస్ లో భాగంగా మందాన  బొటన వేలికి గాయమైంది . వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి  వైద్య పరీక్షలు నిర్వహించారు . గాయం తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల మందాన కు  విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు . 


దీంతో వన్డే సిరీస్ లో పాల్గొనే  టీమిండియా జట్టు నుంచి  మందానా వైదొలిగింది . మందాన  స్థానంలో సెలెక్టర్లు పూజ వస్త్రకార్ కు  అవకాశం కల్పించారు.  గత కొంతకాలంగా టీమిండియా వన్డే విజయాల్లో స్మృతి మందాన కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసింది. కీలక దక్షిణాఫ్రికా వన్డే  సిరీస్ ముందు మందాన  గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో, ఇక  బ్యాటింగ్ భారమంతా మాజీ కెప్టెన్ మిథాలీరాజ్,  ప్రస్తుత కెప్టెన్ హర్మన్ ప్రీత్  కౌర్ లపై పడనుంది. దక్షిణాఫ్రికా తో జరిగిన  టి20 సిరీస్ ను ఇప్పటికే  భారత విమెన్స్ జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే . 


వన్డే సిరీస్ నేటి నుండి ప్రారంభం కానుంది.  దక్షిణాఫ్రికాతో జరుగనున్న మూడు వన్డేల సిరీస్ లో  భాగంగా నేడు ఆతిధ్య  భారత్  జట్టుతో జరుగుతోన్న మ్యాచ్ లో  దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది .  తొలి బంతికే  గోస్వామి  దక్షణాఫ్రికా కు షాక్ ఇచ్చింది . ఓపెనర్ లిజాలే లీ ని  వెనక్కి పంపింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మూడు వికెట్లు కోల్పోయి 56 పరుగులు సాధించిన దక్షిణాఫ్రికా జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉంది


మరింత సమాచారం తెలుసుకోండి: