ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌ను తెలుగు టైటాన్స్‌ విజయంతో ముగించింది. గత మూడు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలు మూటగట్టుకున్న తెలుగు టైటాన్స్ బుధవారం నాడు జరిగిన పోరులో టైటాన్స్‌ 41-36తో యూపీ యోధపై ఘన విజయం సాధించింది. తెలుగు టైటాన్స్ జట్టులో స్టార్ రైడర్ సిద్ధార్థ్‌ దేశాయ్‌ ప్రదర్శన చాల ఆకట్టుకుంది అందరిని.


15 సార్లు రైడింగ్‌ వెళ్లిన సిద్ధార్థ్‌ దేశాయ్‌ 15 పాయింట్లు సాధించి తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టైటాన్స్‌ తరఫున సిద్ధార్థ్‌ దేశాయ్‌ (15) టాప్‌లో  నిలిచాడు. యూపీ యోధ జట్టులో శ్రీకాంత్‌ జాదవ్‌ (8), రిషాంక్‌ దేవడిగ (8) అదరగొట్టారు. సుమిత్‌ (5), మోను గోయత్‌ (4), నితీశ్‌ కుమార్‌ (4)లు పరవాలేదు అనేది విదంగా ఆడారు.


మొత్తం మీద ఈ సీజన్‌లో 22 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ 45 పాయింట్లు సాధించి చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు 4 విజయాలతో తమిళ్‌ తలైవాస్‌ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 33-29తో తమిళ్‌ తలైవాస్‌పై విజయం సాధించింది.గత మూడు మ్యాచ్‌ల్లో విజయం లభించకపోయిన నిరాశ చెందకుండా నిన్నటి మ్యాచ్‌లో బాగా రాణించింది.

మోతనికి విజయం సాదించడంతో తెలుగు టైటాన్స్‌ జట్టు అందంలో ఉన్నారు.
సిద్ధార్థ్‌ దేశాయ్‌ 15 పాయింట్లు సాధించగా,  మిగతా వారిలో కృష్ణ మదనే, ఫర్హాద్‌ చెరో 4 పాయింట్లు సాధించారు. నేడు (గురువారం) జరిగే పోటీలో యు ముంబాతో హరియాణా స్టీలర్స్‌ పోటీ పడనున్నాయి. ఈ ఎలా జరగబోతుందో చూడాలి మరి. ఎవరు విజయం సాధిస్తారో చూడాలి  ఇంకా.... ప్రొ కబడ్డీ లీగ్ అభిమానులు ఈరోజు మ్యాచ్ కోసం ఎదురుచూస్తునారు. గతంలో  స్టార్‌ రైడర్‌ వికాస్‌ ఖండోలా మెరవడంతో ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)లో హరియాణా స్టీలర్స్‌ మరో విజయాన్ని సొంతం చేసుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: