సౌతాఫ్రికా తో జరిగిన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ద్విశకతం తో అదరగొట్టిన టీం ఇండియా ఓపెనర్  మయాంక్ అగర్వాల్ .. తాజాగా  జరుగుతున్న  రెండో  టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో కూడా  సెంచరీ తో సత్తా చాటాడు. ఫలితంగా భారత్ మొదటి రోజు  అట ముగిసే సమయానికి  మూడు వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసి పటిష్ట స్థితిలో  నిలిచింది.  పూణే వేదికగా  సౌతాఫ్రికా తో జరుగుతున్న  ఈ టెస్ట్ లో  టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకున్న భారత్ కు ఆదిలోనే  గట్టి  ఎదురు దెబ్బ తగిలింది.  మొదటి టెస్ట్ లో వరుసగా రెండు ఇన్నింగ్స్ ల్లో  రెండు ఇన్నింగ్స్ ల్లో  రెండు సెంచరీలు చేసి  ఫామ్ లో వున్నా రోహిత్ శర్మ ను  రబాడ అవుట్ చేశాడు.  దాంతో 25పరుగులకే  టీం ఇండియా మొదటి వికెట్ ను కోల్పోయింది. 



అయితే  పుజారా తో కలిసి  మయాంక్  ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు.  ఈ జోడి  లంచ్ వరకు మరో వికెట్ పడనీయకుండా  ఆచి తూచి ఆడారు. ఈక్రమంలో  ఇద్దరు హాఫ్ సెంచరీ లు పూర్తి చేశారు.  మరింత ప్రమాదకరంగా మారుతున్న   ఈజోడి ని రబాడ  విడదీశాడు.  58పరుగుల  వ్యక్తి గత స్కోర్ వద్ద  పుజారా , రబడా బౌలింగ్ లో  అవుట్ అయ్యాడు.  ఆ తరువాత  కోహ్లీ తో కూడా  మయాంక్ చక్కని  భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీం ఇండియా ను పటిష్ట సిత్థిలో నిలిపాడు.  ఈదశలో  మయాంక్ కెరీర్ లో రెండో సెంచరీ సాధించాడు. అయితే సెంచరీ చేసిన  కాసేపటికి మయాంక్ క్యాచ్ అవుట్ అయ్యి పెవిలియన్ చేరుకున్నాడు.  ఈవికెట్  కూడా రబాడ ఖాతాలోనే పడింది.  ఇక ఆతరువాత  కోహ్లీ , అజింక్యా రహానే లజోడి మరో వికెట్ పడనీయలేదు.  ప్రస్తుతం  కోహ్లీ 63పరుగులతో రహానే 18పరుగులతో  క్రీజ్ లో వున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: