పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో పరుగుల కోసం భారత్ తీవ్రంగా కష్టపడిందనే చెప్పాలి. కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ మొదటిలోనే  ఔటయ్యాడు. విశాఖలో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలతో వీరవిహారం చేసిన రోహిత్ శర్మ, ఈ టెస్టులో మాత్రం  కేవలం 14 పరుగులకే పెవిలియన్ చేరడంతో అభిమానులు తీవ్ర నిరాశ అయ్యారు. 


 రబాడా బౌలింగ్‌లో కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనక్కి వెళిపోయాడు. గత టెస్టులో డబుల్ సెంచరీలో కదం తొక్కిన మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పుజారాతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే పనిలో ముందుకు కొనసాగాడు. ఇక లంచ్ సమయానికి మయాంక్ 34*, పుజారా 19* పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరి మధ్య భాగస్వామ్యం 52 పరుగులు కాగా, ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు 77/1.


అయితే, పిచ్ పేసర్లకు సహకారంతో పరుగులు చేసేందుకు టీమిండియా బ్యాట్స్‌మెన్ చాలా కష్టాలు పడుతున్నారు అనే చెప్పాలి. ట్రాక్‌పై కొంచెం గడ్డి ఉండటం వల్ల దాన్ని ఉపయోగించుకొని ఫిలాండర్, రబాడా తొలి స్పెల్‌లో నిప్పులు చెరిగే బంతులతో భయానికి గురైయ్యారు. ఇదిలా ఉండగా, లంచ్ సమయానికి ముందు 30 ఓవర్లు జరగాల్సి ఉండగా, కానీ కేవలం 25 ఓవర్ల పాటే సాగింది.


ప్రస్తుతం మాత్రం ఇండియా బాటింగ్ చేస్తుంది. ఇక బరిలో మాత్రం విరాట్ కోహిల్ మరియు రహానే ఉన్నారు. ప్రస్తుత  విరాట్ స్కోర్ 183 బంతులకు గాను 104 పరుగులు తీసాడు. ఇక  అజ్యింకె రహానే  మాత్రం 161  బంతులకు గాను 58 పరుగులతో బరిలో నిలిచారు.మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, చేటేశ్వర్ పుజారా అవుట్ అయ్యేరు. ఇక టెస్టులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి మరి..


మరింత సమాచారం తెలుసుకోండి: