టెన్నిస్ చరిత్రలో ఎందరో కొత్త కొత్త పోకడలు పోయి తమ తమ దేశాలకు మంచి పేరును తీసుకొచ్చిపెట్టారు.ఇప్పుడు కొత్తగా స్టార్ అయిన ఒసాకా మాత్రం పూర్తి విరుద్ధం. నవోమి ఒసాకా  ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ టెన్నిస్‌లోకి దూసుకొచ్చిన యువ కెరటం. ఒసాకా అమ్మది జపాన్‌ కాగా నాన్నది హైతీ. ఆమె కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. అయితే, వచ్చే ఏడాది జరగనున్న ఒలింపిక్స్‌లో ఆమె అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని జపాన్‌కు ఆడనుంది.
ఈ విషయాన్ని ఒసాకానే స్వయంగా వెల్లడించింది. టోక్యో ఒలింపిక్స్‌లో తాను జపాన్‌కు ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నట్లు ఒసాకా స్పష్టం చేశారు. జపాన్‌లో పుట్టిన 21 ఏళ్ల ఒసాకా ప్రస్తుతం అమెరికాలో నివసిస్తోన్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 16న ఒసాకా తన 22వ పుట్టినరోజుని జరుపుకుంటుంది
జపాన్‌ నిబంధనల ప్రకారం రెండు పౌరసత్వాలు ఉన్న వాళ్లు 22 ఏళ్లు దాటేలోపే ఒక పౌరసత్వాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఒసాకా తన అమెరికా పౌరసత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఒసాకా మాట్లాడుతూ "నా దేశం జపాన్‌కు ప్రాతినిధ్యం వహించడాన్ని ఎంతో గర్వంగా భావిస్తా. ఒలింపిక్స్‌లో జపాన్‌కు ఆడబోతుండడం ప్రత్యేకమైన అనుభూతి" అని చెప్పింది.

జపాన్ ఎక్కువగా ఒసాకాను స్వీకరించినప్పటికీ, ఆమె ఇప్పటికీ కొంత వివక్షతను ఎదుర్కొంటుంది. రెండు వారాల క్రితం, ఓ జపనీస్ కామెడీ జోడీ చేసిన వ్యాఖ్యలపై ఒసాకా నవ్వింది. ఒసాకా వడదెబ్బకు గురైందని, కొంత బ్లీచ్ అవసరమని సరదాగా ఈ జోడీ వ్యాఖ్యానించింది.

ఈ ఏడాది జనవరిలో జపనీస్ నూడిల కంపెనీ నిస్సిన్ సైతం ఓ వాణిజ్య ప్రకటనను సైతం తీసివేసింది.

ఈ ప్రకటనలో ఒసాకాను వర్ణించే కార్టూన్ పాత్ర లేత చర్మం, లేత గోధుమ రంగు జుట్టుతో చూపబడింది. ఇది జపాన్ ప్రజల ఆగ్రహాన్ని గురికావడంతో ఈ కార్టూన్‌ను తొలగించివేశారు.ఇలా ఈ అమ్మడిని పొగిడేవారుంటారు,తిట్టేవారు కూడా ఉండటం ఆశ్చర్యానికి లోనవుతున్న పరిస్థితి చూద్దాం జపాన్ ను గెలిపించి వీర వనిత అవుతుందేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: