మన మేరీ మరో ‘ప్రపంచ’ పతకం సాధించి  చరిత్ర సృష్టించింది. మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్ షిప్ లో ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌ సాధించి స్టార్‌ బాక్సర్‌ మేరీకామ్‌ సెమీఫైనల్లోకి  ప్రవేశ పెట్టింది. దీంతో ఆమెకు 8వ పతకం ఖాయమైంది. ఆమెతో పాటు  మంజు రాణి, జమున బొరొ, లవ్లినా బొర్గొహైన్‌  సెమీస్‌ చేరి కనీసం కాంస్యానికి అర్హత సాధించారు అని చెప్పాలి.


భారత వెటరన్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్ షిప్ లో ఎనిమిదో పతకాన్ని ఖాయం చేసుకుంది. ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌ అయిన ఆమె 51 కేజీల విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. దీంతో అక్కడ ఓడినా కనీసం కాంస్యమైనా దక్కుతుంది. గెలిస్తే పసిడి వేటలో ముందుకు వెళ్తుంది. మూడో సీడ్‌గా బరిలోకి దిగిన మేరీకోమ్‌ 51 కేజీల కేటగిరీలో 5–0తో కొలంబియాకు చెందిన వాలెన్సియా విక్టోరియాను చిత్తూ చిత్తుగా ఓడించింది. 


క్యూబా పురుషుల బాక్సర్‌ ఫెలిక్స్‌ సవన్‌ ఏడు ప్రపంచ పతకాలతో ఉన్న రికార్డును మేరీ ఇది సాధించడంతో చెరిపి వేసింది. మేరీకోమ్‌ వరల్డ్‌ బాక్సింగ్‌లో ఇప్పటికే 6 స్వర్ణాలతో పాటు ఒక రజతం కూడా సాధించింది. క్వార్టర్‌ ఫైనల్లో తలపడిన ఐదుగురు బాక్సర్లలో నలుగురు సెమీస్‌ చేరడంతో భారత్‌కు నాలుగు పతకాలు కచ్చితం అయ్యాయి. మంజు రాణి (48 కేజీలు), జమున బొరొ (54 కేజీలు), లవ్లినా బొర్గొహైన్‌ (69 కేజీలు) సెమీఫైనల్లోకి వెళ్తున్నారు. ప్రపంచ వేదికపై రెండు సార్లు కాంస్యాలు గెలిచిన కవిత చహల్‌ (ప్లస్‌ 81 కేజీలు)కు మాత్రం నిరాశ మిగిలింది.


ఆమె క్వార్టర్స్‌లోనే ఓడిపోయింది. 48 కేజీల బౌట్‌లో మంజురాణి... టాప్‌ సీడ్, గత ‘ప్రపంచ’ ఛాంపియన్ షిప్ కాంస్య విజేత కిమ్‌ హ్యాంగ్‌ మి (దక్షిణ కొరియా)కు పెద్ద షాక్ కూడా ఇచ్చింది. తొలిసారిగా మెగా ఈవెంట్‌లో బరిలోకి దిగిన హరియాణా బాక్సర్‌ మంజు 4–1తో కొరియన్‌ను మొత్తానికి ఇంటిదారి పట్టించింది


మరింత సమాచారం తెలుసుకోండి: