పూణే వేదికగా  ఇండియా - సౌతాఫ్రికా జట్ల మధ్య  జరిగిన  రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 137పరుగుల ఇన్నింగ్స్ తేడాతో  గెలుపొంది మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 0-2 తో  కైవసం చేసుకుంది.  తద్వారా భారత్..   ప్రపంచ క్రికెట్  చరిత్రలోనే  సరికొత్త  రికార్డు సృష్టించింది. స్వదేశంలో  వరుసగా  11  టెస్ట్ సిరీస్ లను గెలిచిన  జట్టు  గా  టీం ఇండియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు  ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఆసీస్  తమ సొంత గడ్డపై  వరుసగా 10టెస్ట్ సిరీస్ లను గెలువగా తాజాగా ఆ రికార్డు ను భారత్  బద్దలు కొట్టింది. 



ఈమధ్య కాలంలో టీం ఇండియా స్వదేశంలో  32టెస్ట్ మ్యాచ్ లు ఆడగా అందులో  25మ్యాచ్ లను గెలిచి  కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లో  మాత్రమే ఓడిపోయింది. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు  స్వదేశంలో  టెస్టుల్లో  భారత జట్టు జైత్రయాత్ర ఎలా కొనసాగుతుందోనని.  ఇదిలా ఉంటే తాజా  సిరీస్ విజయంతో  ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్  పట్టికలో 200 పాయింట్ల తో ఎవరి కి అందనంత  దూరంలో వుంది భారత్.  ఇటీవల  వెస్టిండీస్తో  జరిగిన టెస్ట్ సిరీస్ తో  ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను  ఆరంభించిన  టీమిండియా..ఇప్పటివరకు  ఒక్క  ఓటమి కూడా లేకుండా అన్ని మ్యాచ్ లు గ గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్ర స్థానం లో  కొనసాగుతుంది. రానున్న మ్యాచ్ ల్లో  కూడా టీమిండియా ప్రదర్శన  ఇలాగే కొనసాగితే   ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ ను సాధించడం  మన జట్టుకు పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: