పాకిస్థాన్ క్రికెట్ లో తీసుకొచ్చిన  కొత్త సంస్కరణల వల్ల ఓ దేశవాళీ క్రికెటర్  వ్యాన్ డ్రైవర్ గా మారాల్సివచ్చింది.   వివరాల్లోకి  వెళితే ... 31ఏళ్ళ ఫజల్ సుభాన్ అనే  పాకిస్థానీ దేశవాళీ క్రికెటర్ డిపార్ట్మెంటల్ క్రికెట్ ఆడుతూ  లక్ష రూపాయల వరకు సంపాదించేవాడు.. అయితే ఇటీవల పీసీబీ తీసుకొచ్చిన కొత్త విధానం వల్ల  ఎక్కువ మ్యాచ్ లు ఆడే అవకాశం లేకపోవడం తో  40వేల లోపే ఆదాయం వస్తుంది.  దాంతో తన కుటుంబాన్నిపోషించుకోవడం  కోసం  సుభాన్  వ్యాన్ డ్రైవర్ గా మారాడు.  ఈనేపథ్యం లో సుభాన్ కు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.   



ఆ వీడియో లో ఫజల్ సుభాన్  మాట్లాడుతూ ... దేశం కోసం ఆడాలని చాలా కష్టపడ్డాను కానీ ఆర్థిక ఇబ్బందులు అలాగే  పాక్ క్రికెట్ లో తీసుకొచ్చిన కొత్త రూల్స్ తో   డ్రైవర్ గా మారాను.   అయినా కూడా నేను  సంతృప్తిగానే వున్నాను. రేపు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కదా  నా పిల్లలకోసం  నేను ఏదోవోటి చేయాలి కనీసం నాకు ఈపని అయినా దొరికిందని  అతను ఆవేదన వ్యక్తం చేశాడు.  ఇక ఆ వీడియో ను  ప్రముఖ పాక్ క్రికెటర్ మహమ్మద్ హఫీజ్ ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఈసందర్బంగా హఫీజ్ .. పీసీబీ ఫై   నిప్పులు చెరిగాడు.   కొత్త విధానం వల్ల 200మందికే అవకాశం దక్కుతుంది. మిగితా వారు  ఉపాది లేక అవస్థలు పడుతున్నారు వీరి బాధ్యతలు ఎవరు చూసుకుంటారని హఫీజ్ మండిపడ్డాడు. ఇక సుభాన్ ఇప్పటివరకు 40 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో  2300పరుగులు చేయగా 20లిస్ట్ ఏ మ్యాచ్ లు ఆడి 659 రన్స్ చేశాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: