దూకుడు మీదున్న భారత్ ఇప్పటికే విండీస్‌తో ఆడిన రెండు టెస్టుల్లోనూ విజయం సాధించింది. దీంతో 120 పాయింట్లు వచ్చాయి.దక్షిణాఫ్రికాతో ప్రస్తుతం జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ రెండు మ్యాచ్‌లు గెలుచుకుంది. ఫలితంగా 80 పాయింట్లు వచ్చి చేరాయి. దీంతో భారత జట్టు ఖాతాలో 200 పాయింట్లు ఉన్నాయి. చివరి టెస్టు గెలిస్తే మరో 40 పాయింట్లు వచ్చి చేరుతాయి. ఇక భారత్ తర్వాత న్యూజిలాండ్, శ్రీలంక జట్లు చెరో 60 పాయింట్లతో ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాయి. తొలి స్థానంలో ఉన్న కోహ్లీ సేనకు రెండో స్థానంలో ఉన్న ఈ రెండు జట్లకు మధ్య ఉన్న తేడా ఏకంగా 140 పాయింట్లు. 56 పాయింట్లతో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు నాలుగైదు స్థానాల్లో కొనసాగుతున్నాయి.


ఇకపోతే దక్షిణాఫ్రికాతో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌ ముగిసిన పది రోజుల్లోనే భారత్ గడ్డపై బంగ్లాదేశ్‌ని టీమిండియా ఢీకొట్టబోతోంది. రాంచీ వేదికగా శనివారం నుంచి సఫారీలతో ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడనున్న భారత్ జట్టు.. ఆ తర్వాత నవంబరు 3 నుంచి బంగ్లాదేశ్‌తో మూడు టీ20లు, రెండు టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ రూపొందగా.. తొలి టీ20 మ్యాచ్‌ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుందని తెలిసింది.. ఆ తర్వాత రెండో టీ20 మ్యాచ్‌ రాజ్‌కోట్ వేదికగా 7న, ఆఖరి టీ20 మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా 10న జరగనున్నాయి. అన్ని టీ20 మ్యాచ్‌లూ రాత్రి 7 గంటలకి ప్రారంభంకానున్నాయి.


ఇక నవంబరు 14న నుంచి ఇండోర్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుండగా.. 22 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఈ రెండు టెస్టులూ ఉదయం 9.30 గంటల నుంచి మొదలవనున్నాయి. ఇక బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తొలుత జరిగే టీ20 సిరీస్‌ కోసం ఇప్పటికే  15 మందితో కూడిన జట్టుని ప్రకటించగా.. భారత సెలక్టర్లు ఈ నెల 23న టీమ్‌ని ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇకపోతే మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఇప్పటికే ఈ సెలక్షన్‌కి తాను అందుబాటులో ఉండనని  స్పష్టం చేసిన విషయం తెలిసిందే....


మరింత సమాచారం తెలుసుకోండి: