అతని పేరు యశ్వసి జైస్వాల్ .. క్రికెటర్ కావలేనిది  అతనికి కల ఆ కల నెరవేర్చుకోవడం కోసం ఉత్తరప్రదేశ్ నుండి  ముంబై కి వచ్చాడు. ఉండటానికి ఇల్లు లేదు  గ్రౌండ్స్ మెన్ తో కలిసి ముస్లిం యునైటెడ్  క్లబ్ అనే ఓ టెంట్ లో ఉండేవాడు. ఇది ముంబై  జింఖానా గ్రౌండ్  పక్కనే ఉండేది. బ్రతకడానికి జైస్వాల్  రోడ్ల మీద పానీపూరి అమ్మేవాడు. ఎన్ని  సమస్యలు వచ్చినా ఏనాడూ  క్రికెట్ ను ఒదిలిపెట్టలేదు. ఫలితంగా  జైస్వాల్ 17ఏళ్ళ వయసుకే ఎవరికి సాధ్యం కానీ  రికార్డు నెలకొల్పి చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ లో ముంబై జట్టుకు ఆడుతున్న  యశస్వి జైస్వాల్ జార్ఖండ్ తో జరిగిన మ్యాచ్ లో  154 బంతుల్లో  17ఫోర్లు , 12 సిక్సర్ల  సహాయం తో 203పరుగులు చేశాడు. ఫలితంగా  లిస్ట్ ఏ క్రికెట్ లో  డబుల్ సెంచరీ సాధించిన  పిన్నవయస్కుడిగా  జైస్వాల్  రికార్డు సృష్టించాడు. అంతేకాదు విజయ్ హాజరే ట్రోఫీ చరిత్రలో  ఒకే మ్యాచ్ లో ఓ బ్యాట్స్ మెన్ ఇన్ని సిక్సర్లు కొట్టడం  ఇదే మొదటిసారి. 




కెరీర్ లో మొదటి  విజయ్ హాజరే ట్రోఫీ  ఆడుతున్న  జైస్వాల్  ప్రపంచ రికార్డు నెలకొల్పడంతో ప్రస్తుతం  జైస్వాల్ పేరు మారుమోగుతోంది.  నేషనల్ మీడియా లో  అతని గురించిప్రత్యేక కథనాలు వెలుబడతున్నాయి. టీం ఇండియా మాజీ క్రికెటర్లు  ప్రశంసలతో  ముంచెత్తున్నారు.  ఇక  విజయ్ హజారే  ట్రోఫీ లో ఆడడం కోసం  జైస్వాల్ 10వ తరగతి పరీక్షలను  కూడా  ఎగ్గొట్టాడు. ఇదే విషయాన్ని  జైస్వాల్ దగ్గర ప్రస్తావిస్తే ..  క్రికెటే నా జీవితం  దాని కోసం దేన్నీ లెక్కచేయ్యను అని సమాధానం ఇచ్చాడు.  అలాగే  ప్రస్తుతం ముంబైకే  ఆడుతున్న వసీం జాఫర్  ఇచ్చిన సూచనలు నాకు  ఈ రికార్డు  నెలకొల్పడానికి చాలా  హెల్ప్ అయ్యాయి. ఈ సంధర్భంగా  జాఫర్  సర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాని  జైస్వాల్ పేర్కొన్నాడు.  తపన ఉంటే  ఏమైనా సాధించొచ్చు అని నిరూపిస్తున్న  జైస్వాల్ ఎంతో మంది యువకులకు ఆదర్శంగా నిలుస్తాడనడంలో సందేహం అవసరం లేదు. మరి  జైస్వాల్ ఇలాగే రాణించి  టీమిండియా కు భవిష్యత్ ఆశాకిరణం కావాలని మనుము కోరుకుందాం.. 



మరింత సమాచారం తెలుసుకోండి: