ప్రస్తుతం భారత్ జట్టుకు కోచ్ గా వున్న రవిశాస్త్రికి  నూతన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి మధ్య వైరం వున్న సంగతి తెలిసిందే.  2016లో రవిశాస్త్రి భారత ప్రధాన కోచ్ పదవి కి దరఖాస్తు చేయగా  అప్పుడు కోచ్ ఎంపిక కమిటీ లో సభ్యుడిగా వున్నా గంగూలీ  .. రవిశాస్త్రి ను రిజెక్ట్ చేసి  కుంబ్లే కు మద్దతు  పలికాడు. దాంతో గంగూలీ  వల్లనే తనకు కోచ్ పదివికి రాలేదని  రవిశాస్త్రి  ఎన్నో సార్లు బహిరంగంగానే  విమర్శించాడు.  అయితే ఆ  విమర్శలపై గంగూలీ ఎప్పుడు స్పందించలేదు కానీ  అప్పటినుండి  వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే  వుంది. 



ఇదిలావుంటే  బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా  నిన్న కోల్ కత్తా లో ఓ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విలేకరి అడిగిన ప్రశ్నకు గంగూలీ  తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు.  అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత మీరు రవిశాస్త్రితో మాట్లాడారా అని అడిగిన ప్రశ్నకు గంగూలీ .. ఎందుకు మాట్లాడాలి ..అతను ఇప్పటివరకు ఏం  చేశాడు? అని  సమాధానం ఇచ్చాడు. ఈ సమాధానంలోనే తెలుస్తుంది. రవిశాస్త్రి , గంగూలీ కి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందోనని.. ఇప్పుడు ఎలాగూ గంగూలీ బీసీసీఐ  బాస్ అయ్యాడు కాబట్టి ముందు ముందు రవిశాస్త్రికి తిప్పలు తప్పకపోవచ్చు.  ఇక ఈనెల 23న గంగూలీ , బోర్డు  అధ్యక్షుడిగా  బాధ్యతలు తీసుకోనున్నాడు. 24న సెలెక్టర్ల తో సమావేశం అయ్యి మాజీ సారథి ధోని  భవితవ్యం పై చర్చిస్తామని గంగూలీ  అన్నాడు. నిబంధల ప్రకారం ఈసమావేశానికి రవిశాస్త్రి  హాజరుకాడని కూడా గంగూలీ క్లారిటీ ఇచ్చాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: