క్రికెట్ ప్రపంచాన్ని 1980-90లో   వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లు  ఆదరగొట్టారు, ఆజానబాహులైన పేసర్లు నిప్పులు చెరిగే బంతులు విసురుతుంటే.. అప్పట్లో అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లు సైతం క్రీజులో నిలిచేందుకు భయపడేవారు.. ఇటీవల టీమిండియా పేస్ అటాక్ కూడా ఆ తరహాలో ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తోందని లారా చెప్పుకొచ్చాడు.  

ప్రస్తుత భారత బౌలింగ్ అద్భుతంగా ఉందని. ఒకప్పటి వెస్టిండీస్ బృందాన్ని తలపిస్తోంది అని విండీ స్బ్రియాన్‌ లారా పేర్కొన్నారు. రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ టి20 లీగ్‌ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 16 వరకు ముంబై, పుణే వేదికగా జరుగనుంది, ఈ టోర్నీ వివరాలను గురువారం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సచిన్‌ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రియాన్‌ లారా, తిలక రత్నే దిల్షాన్, బ్రెట్‌ లీ, జాంటీ రోడ్స్‌ పాల్గొన్నారు.  దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్‌లోనే కాదు, గత ఏడాది కూడా భారత పేసర్లు అద్భుతంగా రాణించారు. 2018లో జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ ఏకంగా 142 టెస్టు వికెట్లు పడగొట్టారు.


మరే జట్టు ఫాస్ట్ బౌలర్లూ ఈ తరహాలో నిలకడగా రాణించలేదు. తాజాగా గాయంతో సఫారీలతో సిరీస్‌కి బుమ్రా దూరమయ్యారు. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన ఉమేశ్ కూడా అత్యుత్తమంగా బౌలింగ్ చేస్తున్నాడు.దక్షిణాఫ్రికాతో తాజాగా జరుగుతున్న టెస్టు సిరీస్‌లో వరుసగా రెండు టెస్టుల్లోనూ సఫారీలను కుప్పకూల్చిన భారత బౌలర్లు.. టీమిండియాకి అలవోక విజయాల్ని అందించారు. ఇక రాంచీ వేదికగా శనివారం నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. కనీసం ఈ టెస్టులోనైనా పోటీనివ్వాలని దక్షిణాఫ్రికా ఆశిస్తోంది. కానీ.. తొలి రెండు టెస్టుల్లోనూ ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ దెబ్బకి తేలిపోయిన సఫారీలు.. ఆఖరి టెస్టులోనూ భారత పేసర్లని ఎదుర్కోవడం కష్టమనే చెప్పాలి.  


 'టెస్టు ఛాంపియన్‌షిప్‌ ముందే వచ్చుంటే బాగుండేదని, పసికూనలైన అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ ఆటకు కూడా పెద్ద జట్లు ఇప్పుడు ప్రాధాన్యం ఇస్తాయి. ఇది క్రికెట్‌కు ఎంతో మేలు చేస్తోంది. భారత్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. కీరన్‌ పొలార్డ్‌ విండీస్ టీ20 సారథిగా ఎంపికవ్వడం సంతోషకరం. విండీస్ మళ్లీ పుంజుకుంటుంది' అని లారా చెప్పుకొచ్చారు. రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ టి20 లీగ్‌ నిర్వహణకు రంగం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ టి20 లీగ్‌లో ఇండియా లెజెండ్స్, ఆ్రస్టేలియా లెజెండ్స్, దక్షణాఫ్రికా లెజెండ్స్, శ్రీలంక లెజెండ్స్, వెస్టిండీస్‌ లెజెండ్స్‌ జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. దాదాపు 75 మంది రిటైర్డ్‌ క్రికెటర్లు ఇందులో ఆడనున్నట్లు సమాచారం. ఈ లీగ్‌లో 10 మ్యాచ్‌లు జరుగుతాయి. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌ ఆడుతాయి. భారత్‌కు సచిన్‌ టెండూల్కర్‌ నాయకత్వం వహిస్తుండగా.. జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, జహీర్‌ ఖాన్‌లు ఆడనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: