ఇటీవల జరిగిన భారత్- దక్షిణాఫ్రికాల మధ్య టెస్టు సిరీస్లో ఘోర  విఫలమవుతున్న సౌతాఫ్రికా ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్ సిరీస్ ముగిసింది. తన చేతికి గాయం కారణంగా అతను మూడో టెస్టుకు దూరం అయ్యాడు. అయితే ఈ గాయం ఏదో అనుకోకుండా  జరిగింది కాదు.. తనకు తాను కావాలని చేసుకుంది. ఇటీవల పుణేలో జరిగిన రెండో టెస్టు రెండు ఇన్నింగ్సులలోనూ డకౌట్‌గా కారణంగా  మార్కరమ్ మ్యాచ్ తర్వాత  అసహనాన్ని ఒక బలమైన వస్తువుపై చూపించడం వాళ్ళ గాయానికి గురి అవ్వడం జరిగింది.


 దాంతో మార్క్రమ్ చేతికి తీవ్రమైన గాయమైంది.ఇక  జట్టు సభ్యులు ఫిజియో తీయించిన ఎక్స్ రేలో మణికట్టు ఎముకలో ఫ్రాక్చర్ అయినట్లు తేలడంతో మార్కరమ్ చికిత్స కోసం దక్షిణాఫ్రికాకు తిరిగి ప్రయాణము అయ్యాడు . కాగా.. అతని మార్క్రమ్ లో  మరో ఆటగాడిని ఇంకా ఎంపిక కూడా చేయలేదు. 


ఇక  ఆత్మవిశ్వాసంతో విశాఖ టెస్టులో బరిలోకి దిగిన మార్కరమ్ తొలి ఇన్నింగ్స్ లో 5, రెండో ఇన్నింగ్స్ లో  39 పరుగుల వద్ద వెనుదిరిగాడు. పుణేలో రెండో ఇన్నింగ్స్ లో ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాక రివ్యూకు అవకాశం ఉన్నా...మానసికంగా అప్పటికే కుంగిపోయిన అతను రివ్యూకి  కూడా వెళ్లలేదు.


 గాయపడిన తర్వాత  మార్కరమ్ స్పందిస్తూ.. ఇలాంటి పరిస్థితుల్లో స్వదేశం తిరిగి వెళ్లడం బాధాకరమని.. తాను చేసింది పూర్తిగా తప్పేనని, దానికి తానే బాధ్యత వహిస్తానని స్పష్టం తెలియచేయడం జరిగింది.ఇక  మూడో టెస్టులో మార్కరమ్ స్థానంలో జుబేర్ హపూకు తుది జట్టులో స్థానం ఉండవచ్చు అని తెలుస్తోంది. మరో ఓపెనర్ డీన్ ఎలర్ తన భావన తెలుపుతూ . భారత పర్యటన జీవితానికి సరిపడా ఎంతో అనుభవాన్ని నేర్పించింది అని తెలియచేసాడు.భరత  మైదానాల్లో కఠిన పరిస్థితులు బాగా ఎదురుఅవుతాయి.. దానితో పాటు చిన్న నగరాల్లో, పెద్దగా సౌకర్యాలు లేని హోటళ్లలో కూడా మేము ఉన్నాము అని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: