భారత క్రికెట్ జట్టులో చోటు కల్పించడం అంటే అంతా ఆషామాషీ విషయం కాదు. ఎందరో ఎన్నో సంవత్సరాల కఠోర శ్రమ దాని వెనకాల దాక్కొని ఉంటుంది. అలాంటి వారిలో షాబాజ్ నదీమ్ ఒకడు అతను గత 15 సంవత్సరాలుగా భారత క్రికెట్ కు సేవలు అందించాలని సేవలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.ఎట్టకేలకు తన చిరకాల కోరికను నెరవేర్చుకునే  అవకాశం వచ్చింది. 


ప్రస్తుతం భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ భాగంగా మూడవ మూడో టెస్టు రాంచీలో ఈరోజు మొదలవుతుంది.సిరీస్ మొదటి రెండు టెస్టులు గెలిచి మంచి ఊపు మీద ఉన్న భారత్ మూడవ టెస్ట్ కూడా గెలిచాలి అని కసిగా ఉంది .అనుకోకుండా టీం లోకి షాబాజ్ నదీమ్ నిన్న సెలెక్ట్ అయ్యాడు . నిజానికి నిన్నటి వరకు మూడో టెస్టులో కాదు సిరీస్ లో కూడా తను సెలెక్ట్ అవ్వలేదు.

ఎడమచేతి వాటం స్పిన్నర్ కులదీప్ యాదవ్ గాయపడటంతో అతని స్థానంలో అనూహ్యంగా కు అవకాశం వచ్చింది రాంచీలోని పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది అన్న ఉద్దేశంతో విరాట్ కోహ్లీ  ఇషాంత్ శర్మకి  రెస్ట్ ఇచ్చి  అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ తీసుకోవాలనుకున్నారు. కానీ అతనికి  గాయమవడంతో షాబాద్ కి అదృష్టం కలిసివచ్చింది.  గత కొంత కాలంగా దేశవాళీ క్రికెట్లో స్థిరంగా రాణిస్తున్నారు. మాజీ క్రికెటర్లు అతనికి టెస్ట్ జట్టులో చోటు ఇవ్వాలని గత రెండేళ్లుగా సూచిస్తున్నారు ఇప్పటివరకు నవీన్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో ఏకంగా 424  వికెట్లు పడగొట్టాడు.


ఈ సందర్భంగా ఈరోజు టాస్ కి మందు టీం సమావేశంలో విరాట్ కోహ్లీ నదీమ్ కి ఇండియన్ టీం క్యాప్ అందించాడు .టీమ్ లోని సభ్యులు అందరూ తమ శుభాకాంక్షలు తెలియజేశారు.చూడాలి ఇన్ని ఏళ్ళ నిరీక్షణ ఎలాంటి ఫలితం ఇస్తుందో .


మరింత సమాచారం తెలుసుకోండి: