రాంచి  వేదికగా  సౌతాఫ్రికా తో  జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో  టీమిండియాను రోహిత్ శర్మ , రహానే పటిష్ట స్థితిలో నిలిపారు. టాస్ గెలిచి బ్యాటింగ్ఎంచుకున్న భారత్ .. 31 పరుగులకే టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  ఓపెనర్ మయాంక్ అగర్వాల్ , పుజారా లను రబడా  పెవిలియన్ పంపించగా  కెప్టెన్ కోహ్లీని నొర్తేజ్ అవుట్ చేశాడు. ఈ దశలో మరో ఓపెనర్ రోహిత్ శర్మ , వైస్ కెప్టెన్  రహానే ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. టీ విరామం వరకు మరో వికెట్  పడకుండా   చక్కటి  సమన్వయంతో ఆడిన ఈ జోడీ  భారత్ స్కోర్ ను   200దాటించింది. ఈక్రమంలో  రోహిత్ శర్మ ఈ సిరీస్ లో మూడో సెంచరీ చేయగా  రహానే  కెరీర్లో  టెస్టుల్లో స్వదేశం లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. 




ఇక టీ విరామం  తరువాత మ్యాచ్   ప్రారంభమైన కొద్దీ సేపటి కే వెలుతురు లేమి కారణంగా ఎంపైర్లు తొలిరోజు ఆటను రద్దు చేశారు.  దాంతో తొలి రోజు 58ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మ్యాచ్ నిలిపివేసేసమయానికి  ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 224పరుగులు చేసింది.  ప్రస్తుతం రోహిత్  117పరుగుల తో , రహానే 83పరుగులతో క్రీజ్ లో వున్నారు.  ఇక ఈమ్యాచ్ లో  టీమిండియా తరపున   యువ స్పిన్నర్ నదీమ్ టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు.  స్పిన్ పిచ్ కావడంతో  ఇషాంత్ ను తప్పించి నదీమ్ ను తీసుకోగా  సౌతాఫ్రికా  ఏకంగా 5 మార్పులు చేసింది. గాయాల కారణంగా  మక్రామ్ , మహారాజ్  మ్యాచ్ కు దూరం కాగా  గత రెండు టెస్టు ల్లో విఫలమైన  డిబ్రున్ , ముతుసామీ , ఫిలాండర్ ని కూడా పక్కకు పెట్టారు.  వీరి స్థానాల్లో  క్లాసేన్ , హంజా , నొర్తేజ్ , పెడ్త్ ,జార్జ్ లిండే టీంలోకి వచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: