భారత టూర్ కి వచ్చిన దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ప్రస్తుతం దేశంలో పర్యిస్తోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్‌ ఎల్గర్‌పై సోషల్ మీడియాలో భారత అభిమానులు జోకులు వేస్తున్నారు. మూడో టెస్టు మ్యాచ్‌కి ముందు డీన్ ఎల్గర్ మాట్లాడుతూ "భారత పర్యటన అత్యంత సవాల్‌తో కూడుకున్నది, భారత్‌లో పర్యటిస్తే ఒక క్రికెటర్‌గా మనమేంటో తెలుస్తుంది, ఇక్కడి హోటళ్లు అంతగా బాగో లేకపోయినా మైదానాలు మాత్రం సవాళ్లు విసురుతాయి" అని ఎల్గర్‌ హోటల్స్ గురించి అన్నాడు.


ఈ విషయం నేపథ్యంలో డీన్ ఎల్గర్ వ్యాఖ్యలపై భారత అభిమానులు సోషల్ మీడియాలో జోకులు వేస్తున్నారు. 2017-18 సీజన్‌లో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు కేప్‌టౌన్‌ హోటల్లో భారత ఆటగాళ్లకు కేవలం రెండు అంటే రెండు నిమిషాలే షవర్‌ ని వాడుకోవాలని చెప్పిన నాటి పరిస్థితులను ఇప్పుడు గుర్తు చేస్తున్నారు భారత అభిమానులు.


దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ఓటమికి క్రికెట్‌ అంశాలు కాకుండా ఇతర అంశాలను కారణాలుగా చూపుతున్నాడని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొక నెటిజన్ అయితే ఇతడు ఒక మంచి ఏడుపు ఏడ్చేందుకు అర్హుడంటూ వెటకారంగా ట్వీట్ చేశాడు. ఇవ్వని ఇలా ఉంటే, రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో టీమిండియా వెలుతురు లేమి కారణంగా 224 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయారు.


ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ, రహానే ఉన్నారు. సఫారీ బౌలర్లలో కగిసో రబాడకు రెండు, అన్రిచ్ నోర్ఝికు ఒకొక్క వికెట్ లభించింది. ఇప్పటికే విశాఖ టెస్టులో 137 పరుగులతో , పుణె టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి సిరిస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా ఇప్పుడు క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. ప్రస్తుత రాంచీ టెస్టులో టీమిండియా గెలిస్తే దక్షిణాఫ్రికాను వైట్‌వాష్‌ చేసిన తొలి జట్టుగా కోహ్లీసేన చరిత్ర సృష్టించడం ఖాయం. మూడు లేదా అంతకుమించి మ్యాచ్‌ల్లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల ఇదే తొలి వైట్‌వాష్ సిరిస్ అవడం జరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: