రాంచిటెస్ట్ లో టీం ఇండియా పట్టు బిగిస్తుంది.రెండో రోజు కూడా భారత బ్యాట్స్ మెన్ సంపూర్ణ ఆధిపత్యం చేలాయించడం తో  మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 9వికెట్లనష్టానికి  497పరుగులు చేసి డిక్లెర్ చేసింది. అనంతరం  బ్యాటింగ్ ఆరంభించిన  సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 9పరుగులకే  ఓపెనర్ల వికెట్లను కోల్పయి కష్టాల్లో పడింది. షమీ ,ఉమేష్ ఈ వికెట్లను దక్కించుకున్నారు.  కాగా  మొదటి రోజు లాగానే రెండో రోజు కూడా  చివరి సెషన్ ను ఎంపైర్లు వెలుతురు లేమి కారణంగా తొందరగానే ముగించారు. ఇక ఓవర్నైట్ స్కోర్  3వికెట్ల నష్టానికి  224 పరుగుల తో  రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన  రోహిత్ , రహానేల జోడి..   స్వేచ్ఛగా ఆడుతూ బ్యాట్ ఝుళిపించడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.  ఈక్రమంలో రోహిత్ 150 పరుగులు పూర్తి చేయగా  రహానే  కెరీర్ లో 11వ సెంచరీ పూర్తి చేశాడు.  అయితే లంచ్ విరామానికి ముందు లిండే బౌలింగ్ లో రహానే అవుట్ కావడంతో  అద్భుతమైన భాగస్వామ్యానికి తెరపడింది. 



ఆతరువాత జడేజా తో కలిసి  రోహిత్ చెలరేగిపోయాడు అదే ఊపులో  సిక్సర్ తో కెరీర్ లో ద్విశతకం పూర్తి చేసిన రోహిత్  కాసేపటికే రబాడ బౌలింగ్ లో వెనుదిరిగాడు.   ఆతరువాత  సాహా  ,అశ్విన్  కూడా  తొందరగానే అవుట్ అయినా జడేజా అర్ద శతకంతో  పోరాడాడు. ఇక  చివర్లో ఉమేష్ యాదవ్ బ్యాటింగ్  రెండో  రోజు ఆటలో ఓ హెలైట్ గా చెప్పవచ్చు.  ఎనిమిదో స్థానం లో వచ్చిన ఉమేష్  ఎనిమిది బంతుల్లో  5సిక్సర్ల తో 30పరుగులు చేశాడు.  ఉమేష్ విధ్వంసానికి  స్టేడియం హోరెత్తింది.  భారత బ్యాట్స్ మెన్ ల లో  రోహిత్ 212 , రహానే 113, జడేజా 51 పరుగులతో రాణించగా సౌతాఫ్రికా బౌలర్ల లో రబాడ 3, లిండే 4 , వికెట్లు  పడగొట్టగా పెడ్త్ , నొర్జే తలో వికెట్ తీశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: