ట్వంటీ క్రికెట్ ప్రభావమో ఏమో తెలియదు కానీ భారత్ పేస్ బౌలర్ ఉమేష్ యాదవ్ 10 బంతుల్లో 31 పరుగులు సాధించాడు . ఇందులో ఐదు సిక్సర్లు ఉన్నాయి . ఉమేష్ కు ఇదే వ్యక్తిగత అత్యధిక స్కోర్ కావడం విశేషం .  రాంచి లో దక్షిణాఫ్రికా తో జరుగుతోన్న మూడవ టెస్టు మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఉమేష్ వచ్చి రావడం తోనే జార్జ్ లిండే బౌలింగ్ లో రెండు సిక్సర్లు బాదడమే కాకుండా , మరుసటి ఓవర్ లో మరో మూడు సిక్సర్లు కొట్టి , తన పేరిట   రెండు అతి వేగమైన రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు .


30 పరుగుల్ని వేగంగా చేసిన వారిలో ఉమేష్ యాదవ్ అగ్రస్థానం లో నిలిచాడు . కేవలం తొమ్మిది బంతుల్లోనే ఉమేష్ 30 పరుగులు సాధించగా , గతం లో దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ 10 బంతుల్ని 30 పరుగుల్ని సాధించగా , ఆ రికార్డు ను ఉమేష్ బ్రేక్ చేశాడు .  అతివేగంగా 30  పరుగులు చేసిన వారి జాబితాలో ఉమేష్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తరువాతి స్థానం నామ్ మెక్లిన్స్ ,అబ్దుల్ రజాక్ వరుస స్థానాల్లో నిలిచారు .


ఇక టెస్టు ఫార్మాట్ లో 10 బంతులు ఆడి అత్యధిక స్ట్రైక్ రేటు కలిగిన బ్యాట్స్ మెన్ గా ఉమేష్ యాదవ్ నిలిచాడు . 310 స్ట్రైక్ రేట్ తో టాప్ ప్లేస్ లో ఉండగా , ప్లెమింగ్ 281 .81 స్ట్రైక్ రేట్ ద్వితీయ స్థానం లో ఉన్నాడు . బ్యాట్ తో రాణించిన ఉమేష్ , బౌలింగ్ లోను రాణించి ఒక వికెట్ చేజిక్కించుకున్నాడు .


మరింత సమాచారం తెలుసుకోండి: