రాంచి వేదికగా సౌతాఫ్రికా -ఇండియా జట్ల మధ్య  జరుగుతున్న రెండో టెస్ట్  రెండో రోజు భారత  ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్  తన బ్యాటింగ్ తో  స్టేడియం లో వున్న ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైనర్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్ లో భాగంగా ఎనిమిదో  స్థానంలో బ్యాటింగ్ దిగిన ఉమేష్ ... బ్యాట్ తోచిన్నపాటి విధ్వంసాన్ని  సృష్టించి స్టేడియాన్ని హోరెత్తించాడు.  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5సిక్సర్ల తో  సౌతాఫ్రికా బౌలర్ల పై విరుచుకపడ్డాడు.  వచ్చే రాగానే ఉమేష్ , లిండే బౌలింగ్  లో వరుసగా రెండు సిక్సర్ల బాదాడు . తద్వారా  అతను టెస్ట్ క్రికెట్ లో  వరుసగా  రెండు బంతుల్లో  రెండు సిక్సర్లు కొట్టిన  మూడవ బ్యాట్స్ మెన్ గా  రికార్డు సృష్టించాడు.  ఇంతకుముందు  వెస్టిండీస్  మాజీ క్రికెటర్ ఫోఫీ విలియమ్స్ 1948లో ఇంగ్లాండ్ పై ఈరికార్డు సృష్టించగా 2103లో మాస్టర్ బ్లాస్టర్  సచిన్ టెండూల్కర్ , ఆస్ట్రేలియా పై ఈ  ఫీట్ సాదించాడు.  తాజాగా  రాంచి టెస్ట్ తో  ఉమేష్ ఈ ఘనత సాధించిన  రెండవ భారత క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. 



ఉమేష్ ఈ మ్యాచ్ లో మొత్తం 10 బంతుల్లో  5సిక్సర్ల తో  31పరుగులు చేసి అవుట్ అయ్యాడు.  ఉమేష్ చెలరేగడం తో భారత్ తొందరగానే ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయగలింది.  ఇక  ఉమేష్ బ్యాట్ తో మాత్రమే కాకుండా  బంతితోనూ సత్తా చాటాడు. తను వేసిన  మొదటి ఓవర్ లోనే  డేంజరస్ బ్యాట్స్ మెన్ డికాక్ ను అవుట్ చేశాడు.  దాంతో  సౌతాఫ్రికా  9పరుగులకే  మొదటి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: