రాంచి టెస్ట్ లో టీమిండియా  విజయానికి  ఒక్క అడుగు  దూరంలో నిలిచింది. భారత  బౌలర్ల దాటికి  మొదటి ఇన్నింగ్స్ లో  కేవలం 162   పరుగులకే   కుప్పకూలడంతో  సౌతాఫ్రికా  ఫాలో ఆన్ ను తప్పించుకోలేకపోయింది.   ఓవర్ నైట్ స్కోర్  రెండు వికెట్ల నష్టానికి  9పరుగులతో మూడో రోజు  బ్యాటింగ్ కొనసాగించిన సౌతాఫ్రికా కు  భారత  బౌలర్లు  చుక్కులు చూపెట్టారు.    సౌతాఫ్రికా     బ్యాట్స్ మెన్ లలో   కేవలం ముగ్గురు మాత్రమే  రెండెంకెల స్కోర్ చేయగలిగారు.  భారత బౌలర్ల లో ఉమేష్ 3,నదీమ్ 2, షమీ 2, జడేజా 2 వికెట్లు తీశారు.  అనంతరం  ఫాలో ఆన్ ను కొనసాగించిన  సౌతాఫ్రికా ను ఆదిలోనే  ఉమేష్ యాదవ్ ,షమీ  కోలుకోలేని దెబ్బ తీశారు. వీరిద్దరి దాటికి సౌతాఫ్రికా  35 పరుగులకే 5వికెట్ల  కోల్పోయింది. 




ఈదశలో  లిండే , పీడ్   కౌంటర్ ఎటాక్ చేశారు. అయితే  వీరి  జోరు ఎక్కువ సేపు కొనసాగలేదు. అనవసరమైన రన్ కు యత్నించి లిండే రన్ అవుట్ కావడంతో  సౌతాఫ్రికా కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఆతరువాత  వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే   కాంకుషన్ సబ్ స్ట్యూట్ గా వచ్చిన  డీ బ్రున్ , నొర్జే  తో కలిసి మరో వికెట్ పడనీయలేదు. దాంతో  మూడో రోజు ఆటముగిసే సమయానికి  సౌతాఫ్రికా  8వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.  కాగా  రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తుండగా ఉమేష్ వేసిన బంతి ఓపెనర్ ఎల్గర్ తలకు బలంగా తగలడంతో  అతను అక్కడే  కుప్పకూలిపోయాడు. వెంటనే ఫిజియోవచ్చి  ప్రాథమిక చికిత్స చేసి  ఎల్గర్ ను తీసుకెళ్లాడు. దాంతో  సౌతాఫ్రికా  కాంకుషన్ సబ్ స్ట్యూట్ గా  డీ బ్రున్  ను తీసుకుంది.  ఇక  సౌతాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో ఓటమి చెందకుండా ఉండాలంటే ఆ జట్టు మరో 203 పరుగులు చేయాలి.. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో అది దాదాపు అసాధ్యం కాబట్టి వరుసగా  రెండో సారి ఇన్నింగ్స్ ఓటిమి తో  సౌతాఫ్రికా  భారత పర్యటనను ముగించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: