సౌతాఫ్రికా తో జరిగిన మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో  హిట్ మ్యాన్ రోహిత్ శర్మ  ప్రదర్శన  ఈ సిరీస్ కు  హైలైట్  గా నిలిచింది.  ఈ ఫార్మాట్ లో మొదటి సారి ఓపెనర్ గా వచ్చిన రోహిత్ .. వైజాగ్ టెస్ట్ లో  రెండు ఇన్నింగ్స్ ల్లో రెండు  సెంచరీ లు చేసి అదుర్స్ అనిపించాడు.   ఈనేపథ్యం లో పలు రికార్డు లు సృష్టించిన  అతను  తాజాగా  రాంచి లో జరిగిన  చివరి టెస్ట్ లో ఏకంగా డబుల్ సెంచరీ తో చెలరేగి పోయి  మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.   దాంతో మ్యాన్ అఫ్ ది మ్యాచ్  తోపాటు  మ్యాన్ అఫ్ ది సిరీస్  అవార్డులను  గెలుచుకున్నాడు. ఈక్రమంలో  రోహిత్ మరో రికార్డు కు కూడా  సృష్టించాడు. ఈసిరీస్ లో  రోహిత్  మొత్తం  529 పరుగులచేసి  సౌతాఫ్రికా ఇండియా టెస్ట్  సిరీస్ ల్లో  అత్యధిక  పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మొదటి స్థానానికి చేరుకున్నాడు. కాగా  498 పరుగులతో  సౌతాఫ్రికా మాజీ  అల్ రౌండర్ కలీస్ రెండవ స్థానంలో వున్నాడు. 




ఇక  రాంచి టెస్ట్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. ముందుగా  నాపై నమ్ముకముంచిన  జట్టు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.  పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఓపెనర్ గా వచ్చాను కాని రెడ్ బాల్ క్రికెట్ లో  ఓపెనర్ గా రావడం  కొత్తగా అనిపించింది. కుదురుకోవడానికి కొంచెం సమయం తీసుకున్నాను. ఆతరువాత  నా సహజ శైలి లో  ఆడాను.  ఓపెనర్ గా రాణించడం ఆనందం గా వుంది.   మనం సక్సెస్ కావాలంటే  మన ప్రతిభ కు తోడు కెప్టెన్ , కోచ్ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం . ఈవిషయంలో రవిశాస్త్రి , కోహ్లీ  నాకు చాలా సపోర్ట్ చేశారు.  ఇక ముందు కూడా ఇదే ఆటతీరును  కొనసాగిస్తాననే నమ్మకం ఉందని  రోహిత్  తెలియజేశాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: