భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ ) నిబంధనపై ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ , డాషింగ్ ఆల్ రౌండర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు . బీసీసీఐ ఇప్పటికైనా తన నిబంధన లను సవరించాలని ఇరువురు క్రికెటర్లు సూచించారు . ఇంతకూ ఈ ఇద్దరు పంజాబ్ క్రికెటర్లకు బీసీసీఐ నిబంధనలపై ఎందుకంత  ఆగ్రహం కలిగిందంటే ... విజయ్ హజారే ట్రోఫీ లో వర్షం కారణంగా  పంజాబ్ జట్టు సెమీస్ ఆశలు గల్లంతు కావడమే దానికి కారణం . తమిళనాడు,  పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షార్పణం కావడం ఈ ఇద్దరి క్రికెటర్లను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది .


  రిజర్వ్ డే ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని హర్భజన్ , యువీ లు అభిప్రాయపడ్డారు . విజయ్ హజారే క్రికెట్ టోర్నీ క్వార్ట్రర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం తో ... లీగ్ దశ లో అత్యధిక విజయాలు సాధించిన తమిళనాడు జట్టు సెమీస్  ప్రవేశించింది. లీగ్ దశ లో విజయాల ఆధారంగా తమిళనాడు జట్టు సెమీస్ అర్హత సాధించడం పట్ల హర్భజన్ విస్మయం వ్యక్తం చేస్తూ ... ఇదొక చెత్త నిబంధన , ఇలాంటి  టోర్నీలో కీలక మ్యాచ్ లకు రిజర్వ్ డే ఎందుకు కేటాయించకూడదని ప్రశ్నించాడు . బీసీసీఐ తన నిబంధనలపై ఒక్కసారి పునరాలోచించుకోవాలని సూచించాడు.


 విజయ్ హజారే టోర్నీ లో పంజాబ్ ను మరోసారి దురదృష్టం వెంటాడిందన్న యువరాజ్ , రిజర్వ్ డే లని కారణంగానే పంజాబ్ సెమీస్ కు వెళ్లలేదని వ్యాఖ్యానించాడు . రిజర్వ్ డే ఎందుకు కేటాయించలేదో అర్ధం కావడం  లేదన్న ఈ దిగ్గజ క్రికెటర్ , దేశవాళీ టోర్నీ అని రిజర్వ్ డే కేటాయించలేదా ? అంటూ బీసీసీఐ ని సూటిగా ప్రశ్నించాడు . 


మరింత సమాచారం తెలుసుకోండి: