టీమిండియా క్రికెటర్ల  కోసం తాజాగా  బీసీసీఐ ఓ  నిర్ణయం తీసుకుంది. ప్రతి మ్యాచ్ లో  అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికీ  దేశీయ విమానాల్లో  బిజినెస్ క్లాస్ లో ప్రయాణించే వెసులుబాటును కలిపిస్తూ నిర్ణయం తీసుకుంది.  ఇంతకుముందు కెప్టెన్ ,ప్రధాన కోచ్ ల కు మాత్రమే  ఈ సౌలభ్యం ఉండేది. దాంతో  మిగితా క్రికెటర్లు సహాయక సిబ్బంది  ఎకానమీ క్లాస్ లో ప్రయాణించే వారు. 



ఇక తాజాగా బీసీసీఐ  ఇచ్చిన   బంపర్ ఆఫర్ ను  భారత పేసర్లు  షమీ , ఇషాంత్  ఇప్పటికే  వాడుకున్నారు. వైజాగ్ టెస్ట్ లో అద్భుతప్రదర్శన చేసిన తర్వాత షమీ బిజినెస్ క్లాస్ లో కూర్చుని ప్రయాణించగా  అంతకుముందే ఇశాంత్  కూడా  ఈ అవకాశాన్ని  వినియోగించుకున్నాడు.  మాములుగా  బిజినెస్ క్లాస్ సీట్లు తక్కువగా  ఉంటాయి కాబట్టి  ఆటగాళ్ళందరికి  ఆ సీట్ల ను కేటాయించడం కుదరనిపని. దాంతో కెప్టెన్  కోచ్  లకు మాత్రమే అందులో కి ఎంట్రీ ఉండేది. ఇక ఇప్పుడు తాజా నిర్ణయంతో  అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లు కూడా ఆ సీట్లలో కూర్చొని ప్రయాణించనున్నారు.  అలాగే  వైస్ కెప్టెన్ లకు  కూడా  సూట్ రూమ్ ఇవ్వాలని  బీసీసీఐ  నిర్ణయించింది. దాంతో  రహానే , రోహిత్ లకు బిజినెస్ క్లాస్ లో  ప్రయాణించనున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: