చుట్టూ కొండలు కోనలు.. 

 శ్రీకాకుళం జిల్లాలో మరీ మూలకు విసిరేసినట్టుండే ప్రాంతం

వ్యవసాయానికి అంతంతమాత్రమే అనువుగా ఉండే భూములుమౌలిక సదుపాయాల సంగతి సరే సరిఅలాంటి గ్రామంలో ఉపాధి హామీ పథకం అద్భుతాలే చేసింది.

 కొండకోనల్లోని గిరిజనుల్లో కొండంత ఆత్మవిశ్వాసం నింపిందిప్రభుత్వం ఇచ్చిన తోడ్పాడుతో అడవి బిడ్డలు కదిలారుప్రగతి బాట పట్టారు.

శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుండి 80కిలో మీటర్ల దూరంలో సీతంపేట మండలం లో 16 ఆవాసాలున్న గిరిజన గ్రామం పొల్లఈ పల్లె జనాభా 2392. ఊరు బాగుపడాలంటే జల సంరక్షణ చేపట్టాలి

కురిసిన ప్రతి చినుకునూ ఒడిసిపట్టాలిఇంకుడు గుంతలు తవ్వుకోవాలివ్యక్తిగత మరుగుదొడ్లు కట్టుకోవాలివైవిధ్యమైన పంటలు పండించాలిఇవన్నీ నిజమేకానీ ఇవి జరిగేదెలా.. వీటికి నిధులు ఎవరు ఇస్తారు.పోనీ గ్రామస్తులంతా ఏకమై ఈ పనులు చేసుకుందామంటే పొట్టగడిచేదెలా.. ఇవన్నీ ప్రశ్నలేవీటికి సరైన జవాబుగా ఉపాధి హామీ పథకం నిలిచింది

ఈ గ్రామ తలరాతను మార్చేసిందికొంచెం కొంచెంగా కుదిరిన నమ్మకం గ్రామస్తులను ఒక్కటి చేసింది.

పొల్ల గ్రామస్తులుజల సంరక్షణతోనే జీవితాలు బాగుపడతాయని నమ్మారుగ్రామం చుట్టుపక్కల ఉన్న నాలుగు చెరువుల్లో పూడిక తీశారుమరో నాలుగు బోర్‌ వెల్‌ రీచార్జ్ యూనిట్లు ఏర్పాటు చేసుకుని బోర్లు పునరుద్ధరించుకున్నారు. 485 ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారుక్రమంగా వారి కృషి ఫలించింది.గతంలో 16బస్తాల వరి దిగుబడి ఉంటేఉపాధి హామీ పథకం ద్వారా జలసంరక్షణ పనులు చేపట్టాక అది 24బస్తాలకు పెరిగిందని గ్రామస్తులంటున్నారు.

మొత్తం మీద సహజ వనరుల అభివృద్ధి పనుల వల్ల 969 ఎకరాలు పొల్ల పంచాయితీలో సాగులోకి వచ్చాయిగ్రామస్తులు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి.  పొల్ల గ్రామంలో మొత్తం 40 పొదుపు మహిళా సంఘాలు ఉన్నాయిగ్రామంలో పారిశుధ్యం స్పృహ కూడా పెరిగింది.  గ్రామంలో మొత్తం 352 వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయిగతంలో పూరింటిలో బతికిన నిమ్మక ప్రమీల ఇప్పుడు ఎన్టీఆర్‌ గృహాన్ని నిర్మించుకొని సంతోషంగా చంటి బిడ్డతో బతుకుతోంది.

 పొల్ల ప్రగతి పయనం ఇదే పంచాయితీలోని చీడిమాను గూడలోనూ మార్పు తీసుకొచ్చిందిఅయితే ఇక్కడ సమస్య వేరేఈ ప్రాంతమంతా కొండవాలుకురిసిన చినుకులు జాలువారి భూమి సారవంతమయ్యేది కాదుఅందుకే దీనికి పరిష్కారంగా కొండవాలులో కందకాలు తవ్వారుభూసారం కొట్టుకు పోకుండా ఆపారుఆ కొండ వాలులోనే నేల కాస్త ఎక్కువ చదునుగా ఉన్నచోట వరి పండిస్తున్నారుమిగిలిన ప్రాంతంలో పైనాపిల్,పసుపుజీడిమామడిసీతాఫలం పంటలు పండిస్తున్నారు.

చీడిమానుగూడలో వచ్చిన మార్పుకు నాగేశ్వరరావురాము నిదర్శనంజలసంరక్షణ చర్యలు ఇచ్చిన భరోసాతో కూరంగి నాగేశ్వరరావుహారిక రాము చెరో అరెకరంలో మామిడిసపోటా మొక్కలు పెంచుతున్నారుఈ సాగు కూడా నరేగా కార్యక్రమంలో భాగంగానే చేశారువచ్చే ఏడాది తోట కాతకు వస్తుందని వారు సంతోషంగా చెప్పారు

తనకు తాను సాయపడేవాడికే దేవుడు కూడా సహాయపడతాడు అని ఓ సామెతఈ పొల్ల గ్రామపంచాయతీ విషయంలోనూ ఇదే జరిగింది

తాగునీటి కోసం చాపరాయి గూడగిరిజనులు పడుతున్న కష్టాలు చూసి పరిష్కారం కోసం ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకు కదిలిందివిద్యుత్ కోతలతో ఇబ్బంది లేకుండా సోలార్ పవర్‌తో తాగునీటి సదుపాయం ఏర్పాటు చేసిందిఇలా నరేగా అందించిన తోడ్పాటుతో పొల్ల గ్రామ పంచాయతీ అభివృద్ది దిశగా అడుగులు వేస్తోంది. ( pic/shyammohan/9440595858)



మరింత సమాచారం తెలుసుకోండి: