ఈ తొలకరి రైతులకు అరుదైన కాన్క!
 సాగుబడి గిట్టుబాటు లేక రైతులు అప్పుల పాలవ్వడం, వలసలు పోవడం చూస్తున్నాం. వ్యవసాయం లో నిరాశ పోవాలంటే, సాగు విధానం మార్చి, దిగుబడి పెంచాలి. కంది పంట మీద కొన్ని నెలలు , యువ రైతులతో పంటపొలంలోనే ప్రయోగాలు చేసి , ఫలితాలు సాధించారు. 
'' తెలంగాణలో కొన్ని రకాల పంటల దిగుబడి తగ్గుతున్న నేపథ్యంలో వికారాబాద్‌ జిల్లా, తాండూరు పరిసర ప్రాంతాల్లో వ్యవసాయం, అక్కడి జీవనోపాధులను రూరల్‌ మీడియా సంస్ద, రైతులు,గిరిజనుల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న 'ఏకలవ్య ఫౌండేషన్‌ 'తో కలిసి అధ్యయనం చేసింది. 
తెలంగాణలో కంది పంటలో దిగుబడి పెంచడమే లక్ష్యంగా ఈ పరిశోధన మొదలైంది. వికారాబాద్‌ జిల్లాలో, కనీసం లక్ష ఎకరాలలో కంది పంటను సాగు చేస్తున్నారు. కానీ క్రమేపీ దిగుబడి తగ్గిపోతుంది. ఈ పరిస్దితిని మార్చి, దిగుబడి పెరిగేలా రైతులకు యాజమాన్య పద్దతుల పై అవగాహ కలిగించే దిశగా ఈ బృందం అడుగులు వేసింది. అధ్యయనంలో సాధించినవి... 
1, ఎకరా కంది పంట పై కనీసం ఒక క్వింటా దిగుబడి పెంచడం, 
2, ఆర్గానికిక్‌ సర్టిఫికేషన్‌ ద్వారా మార్కెట్‌ చేయడం. దీని ద్వారా ఒక్కొక్క రైతుకు సంవ్సరానికి రూ 10,000 అధిక ఆదాయం తీసుకోవచ్చు. విత్తనం నుండి పంట కోసి,అమ్మేవరకు రైతుల అనుభవాలను తీసుకుని, వారి ద్వారానే సమస్యలకు పరిష్కారం చేయడం ద్వారా, కనీసం 4 నుండి 5 వందల ఎకరాలలో 1 క్వింటా దిగుబడి అధికంగా సాధించారు. 
3, రైతులకు ఎదురైన సమస్యలను చిన్న చిన్న పరిష్కారాలతో పూర్తిగా అధిగమించారు. 
4, ఏకలవ్య ఫౌండేషన్‌ సేంద్రియ మిత్ర అనే ప్రాజెక్ట్‌ ద్వారా 500 మంది రైతులకు గ్రూపులుగా చేసి, భాగస్వామ్య పద్ధతిలో సేంద్రియ సర్టిఫికేషన్‌ ఇవ్వడం ద్వారా ద్వారా సంవత్సరానికి కనీసం రూ. 100 కోట్లు ఆదాయాన్ని పొందవచ్చు అనే ఒక అవగాహన కలిగించింది.
నిన్న... వికారాబాద్‌ జిల్లాలో రైతులు వర్షాధారం పై కంది సాగు చేస్తున్నారు. ఎక్కువ శాతం రైతులు లక్ష ఎకరాల్లో కందులు పండిస్తున్నారు.1,91,597 మంది రైతు కూలీలకు పని దొరుకుతోంది. వర్షాధారం మీద ఆధార పడటం వల్ల ఎకరానికి ఎకరానికి 1 నుండి 3 క్వింటాళ్ళు మాత్రమే దిగుబడి వస్తోంది. అంతర పంటలు మినుము,పెసర మీద కూడా 1 నుండి ఒకటిన్నర క్వింటాలు మాత్రమే దిగుబడి వస్తోంది. ఖర్చులన్నీ పోనూ నికరాదాయం ఎకరానికి రూ.16 వేలు మాత్రమే మిగులుతోంది.అది కూడా ప్రకృతి అనుకూలిస్తేనే. 
నేడు... ఈ పరిస్ధితిని అధికమించి, కంది దిగుబడి పెంచగలిగితే, కనీసం మరో పదివేలు ఎక్కువ ఆదాయం వచ్చేలా సాగు విధానంలో మార్పులు తేవాలన్నదే ఈ సంకల్పం. జిల్లాలో సాగయ్యే 1.25,000 ఎకరాల్లో కనీసం లక్ష ఎకరాల్లో అయినా కనీసం ఎకరానికి 1క్వింటా దిగుబడి పెరగడం ద్వారా రూ.5వేలు,సమష్టి మార్కెట్‌ ద్వారా రూ.5వేలు, ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇలా లక్ష ఎకరాలకు గానూ ఏడాదికి వందకోట్ల ఆదాయం పెంచే అవకాశం ఉంది.

కంది సాగులో దశాబ్దాల అనుభవం ఉన్న స్థానిక రైతుల సూచనలు, విత్తనాల ఎంపిక నుండి ఎండుతెగులు నివారణ వరకు నిపుణులు చెప్పిన పరిష్కారాలు క్రోడీకరించి ఈ అధ్యయనం జరిగింది. కంది దిగుబడి పెంచే మార్గాలు ఈ సాగులో అధిక దిగుబడి సాధించడంలో ప్రధానంగా యాజమాన్య పద్దతులే కీలకం. ఈ పద్దతుల్లో లోపాల వల్ల దిగబడులు గణనీయంగా తగ్గి పోతున్నాయి. వీటిని అధికమించి , పెట్టుబడి లేని సాగు పద్దతులతో అధిక దిగుబడి సాధించే మార్గాలు ఈ పరిశోధనలో వివిరించారు. ఒక క్వింటా అధిక దిగుబడి సాధించారు... 

రూరల్‌మీడియా, ఏకలవ్యఫౌండేషన్‌ బృందం, ఏడాది క్రితం జింగుర్తిలో పది ఎకరాల్లో పైన చెప్పిన పద్దతులలో రైతులతో కందిని సాగు చేయించగా ఎకరాకు 3నుండి 4 క్వింటాళ్లు దిగుబడి సాధించారు. అంటే గతంలో కంటే ఒక క్వింటా అధనంగా దిగుబడి పెరిగింది. తెలంగాణ రైతాంగం పై పద్దతులు పాటిస్తే అధిక దిగుబడులు పెంచుకునే అవకాశం ఉంది. 
 ఈ అధ్యయనం పై సందేహాలు ఉంటే, సాగు పద్దతుల గురించి ఫోన్‌లో సంప్రదించండి. రమాకాంత్‌ ( 8374721751 ) విత్తన దశ నుండి నేల సారం పెంచడం,సేంద్రీయ సాగు మొదలైన యాజమాన్య పద్దతులను సమగ్రంగా తెలిపే రిపోర్టు కొరకు ఈ నెంబర్‌కి ( 9440595858) వాట్సాప్‌ మెసేజ్‌ పెట్టండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: