వర్షాలు,వరదలు వీడడంలేదు అసోంలో వరద బీభత్సం కొనసాగు తోంది భారీ వర్షాలతో తీవ్ర కష్టాలు పడుతున్న ముంబైవాసులకు వాతావరణ శాఖ పిడుగు లాంటి వార్తను చెప్పారు.ఇవాళ,రేపు, ఎల్లుండి మూడ్రోజుల పాటు ముంబైలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది .  మహారాష్ట్ర,తెలంగాణతో పాటు గుజరాత్,నాగాలాండ్,మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రాలకు కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది.హిమాచల్ ప్రదేశ్ లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని హెచ్చరించారు.ఐఎండీ తాజా హెచ్చరికలతో ముంబైవాసులు ఠారెత్తిపోతున్నారు .


కొన్ని రోజులుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు దేశ వాణిజ్య రాజధాని అతలాకుతలమైంది.మురికివాడలోని లోతట్టు ప్రాంతాల్లోనే కాక మెరక ప్రాంతాలకు కూడా వరద పోటెత్తటంతో మురికివాడలోని ప్రజల పరిస్థితి అయితే భయానకంగా మారింది . అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది . డ్రైనేజ్ వాటర్ మురుగుతో స్థానికులు అనారోగ్యం పాలయ్యారు.ముంబై వీధుల్లో నదుల్ని తలపించడంతో చాలా ప్రాంతాల్లో వాహనాల ముందు కదలలేక విద్యార్దులు స్కూళ్లకు,ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లేందుకు తీవ్ర ఇబందులు పడుతున్నారు.


ముంబైలోనే కాక తానే,నాసిక్ లో అర్ధ రాత్రి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.నాసిక్లో కురుస్తున వర్షాలకు పలు ప్రాంతాలు జలమయం అవడంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది.మహారాష్ట్రలో పడుతున వర్షాల వలన పలు ప్రాంతాల్లో పట్టాలు నీట మునగటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. మూడు వారాలుగా ముంబైలో కురుస్తున వర్షాలకు పురాతన భవనాలు కూలిపోతున్నాయి. మరో రెండు మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ముంబైలోని ప్రజలు  ఎప్పుడు ఏ భవనం కూలిపోతుందనే భయంతో నిద్ర కూడా కరువైంది.


చత్తీస్గఢ్లో కురుస్తున్న వర్షాల వల్ల జగదల్ పూర్ పరిసర ప్రాంతాలను వరదలు నీరు ముంచెత్తుతునాయి. వరదలకు ఓ రిసార్ట్ లో చిక్కుకున్న బాధితులను మరియు గణపతి రిసార్ట్స్ లో చిక్కు కున్న బాధితులను రెస్క్యూ టీమ్స్ రక్షించి సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. బీహార్ దర్బంగా లో ఓ సరస్సులో ఉన్న బ్రిడ్జి ప్రమాదకర స్థితికి చేరుకోవటంతొ భారీ వర్షాలకు తోడు సమీపిస్తున్న తరుణంలో ఆ భారాన్ని తట్టుకోలేక బ్రిడ్జిని ఆనుకొని ఉన్న గట్టు కోతకు గురై వరద ఉధృక్తికి బ్రిడ్జి కింది భాగం మట్టిగొట్టుకుపోటంతో, బ్రిడ్జి ఊగిపోతోంది దాంతో బ్రిడ్జి పైన వాహనాలను నడపాలంటేనే ప్రయాణికులు భయపడుతున్నారు.


దీంతో యుద్ధ ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టారు అధికారులు.ఇటుకలు,ఇసుక,మట్టి తెచ్చి బ్రిడ్జిని పటిష్టం చేస్తున్నారు.  నాలుగు వారాలకు పైగా వరదలతో తీవ్రంగా నష్టపోయిన అసోంలో వర్షాలు పడటంతో వరద ఉధృతి మళ్లీ పెరుగుతోంది.ప్రకృతి ప్రకోపానికి అసోంలో జన జీవనం పూర్తిగా స్తంభించింది. నిన్నటికి నిన్న అసోంలో వరదలకు నలుగురు  మృత్యువాతపడ్డారు


మరింత సమాచారం తెలుసుకోండి: