Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 1:15 pm IST

Menu &Sections

Search

మన గొయ్యి మనమే....

మన గొయ్యి మనమే....
మన గొయ్యి మనమే....
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మనిషి చేస్తున్న తప్పు. మానవజాతికి పరిణమించబోతోంది అతి పెద్ద ముప్పు…భూమి మీద మానవాళికి కొన్ని తరాల వరకు శాశ్వత శతృవుగా రూపుగాంచుతున్న ఆ ముప్పు పేరు ప్లాస్టిక్.  ప్లాస్టిక్ పేరు తెలియని మనిషి వుండరు. అసలు ప్లాస్టిక్ మన దైనందిన జీవితంలో ఎలా నిక్షిప్తమవుతుందో ఓసారి చూద్దాం. ప్లాస్టిక్ లో అతి సూక్ష్మమైన ప్లాస్టిక్ ను మనం నిత్యం విరివిగా వాడే టూత్ పేస్టులలోను, షాంపులతోను కలుపుతారు. ప్లాస్టిక్ అనేది అవసరం కాదు. దానికి ప్రత్యామ్నాయం లేకా కాదు. మనిషి పెంచుకుంటున్ననిర్లక్ష్య ధోరణి, అత్యాశ.  తప్పని తెలిసినా మళ్ళీ మళ్ళీ ఆ విషాన్ని మానవజాతి ఇంకా ప్రోత్సహిస్తుండడం నిజంగా విడ్డూరం. అక్కడా... ఇక్కడా ....అని కాదు అంతటా, ఇంకా చెప్పాలంటే..అది విశ్వవ్యాప్తంగా విస్తరించి వుంది.  అశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనం ఊహించని ప్రదేశంలో కూడా అది ఉంది. ఎలాగంటారా...

       2012 సంవత్సరంలో పసిఫిక్ మహా సముద్రపు ఒకానొక బీచ్ లో  కొంతమందికి ఓ రకం తిమింగళం పట్టుబడింది. శాస్త్రవేత్తలు దాని కడుపు భాగాన్ని పరిశీలించగా వాళ్ళకి దొరికిన అవశేషాలు చూసి ప్రపంచం నివ్వెరపోయింది. 30 చ.మీ టార్పోలిన్, 4.1/2 మీటర్ల ఇనప కంచె, 9 మీటర్ల ప్లాస్టిక్ తాడు మరియు రెండు పూల కుండీలు. ఇది ఎలా సాధ్యపడింది.

          మీకు తెలుసా ...సగటున ఓ యూరోపియన్ దేశస్తుడు సంవత్సరానికి 100 కిలోల ప్లాస్టిక్ ను వినియోగిస్తాడు. అలా దేశం మొత్తంమీద వినియోగించిన ప్లాస్టిక్ తిరిగి వ్యర్ధంగా మారి 100 ల టన్నుల రూపంలో కొంత భూభాగం మీద మరి కొంత సముద్రగర్భానికి విసిరి వేయబడుతుంది. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యాఅలా నిక్షిప్తమయిన వ్యర్ధాలన్నీ  పసిఫిక్ మహా సముద్రంలో ఓ మహా ద్వీపంగా ఇంకా చెప్పాలంటే దాదాపు యూరప్ దేశమంతలా రూపాంతరం చెందిందటే అతశయోక్తి కాదు. సముద్రగర్భంలో ఇంకా కొన్ని చోట్ల సహజ వనరుల కంటే 60శాతం ప్లాస్టిక్ వ్యర్ధాలే ఉన్నాయన్న విషయం వాస్తవం. ఎందుకంటే ప్లాస్టిక్ అనే పదార్ధం అంత త్వరగా నాశనమవదు.

       సాధారణ మనిషి ఆయుష్షు దాదాపు 70 సంవత్సరాలైతే ప్లాస్టిక్ ఆయుష్షు అక్షరాలా 500 సంవత్సరాలు. మరి దానిని నాశనం చేయడమెలా... ప్లాస్టిక్ ను మండించినా అది విష వాయువుగా మారి ఇంకా ప్రమాదకరంగా మారుతుంది. పోని విరగ్గొట్టి సముద్రం లో పారవేసినా మిగతా వ్యవసాయ, పారిశ్రామిక వ్యర్ధపదార్ధాలతో మిళితమై మరింత విషంగా మారుతుంది. నీటిలోని జంతువులు తమ ఆహారం అదేనని భావించి ఆరగిస్తాయి. భయంకరమైన విషయం ఏమిటంటే ప్లాస్టిక్ వ్యర్ధ పదార్ధాలు తిన్న జంతువులు ప్రతి సంవత్సరం లక్షల కొలది చాలా దారుణంగా ప్రాణాలు విడుస్తున్నాయి. ఎంతలా అంటే వాటి కడుపు నిండుగా వున్నా ఆకలితో అలమటిస్తూ అతి ఘోరాతి ఘోరమైన చావును చవి చస్తాయి. ఎందుకంటే వాటి కడుపు , కాలేయ భాగాలు ప్లాస్టిక్ వ్యర్థ పదార్ధాల వల్ల పూర్తిగా చెరిగిపోయి వుంటాయి కాబట్టి. మరింత విడ్డూరం ఏమిటంటే అలా పట్టుబడిన జంతువులు మళ్ళీ మనిషికి ఆహారంగా మారడం.

          ప్రతిరోజూ వాడే ఒక టూత్ పేస్టులో దాదాపు 10 శాతం అతి సూక్ష్మమైన ప్లాస్టిక్ కలిగి వుందంటే మీరు నమ్మగలరా.. అలా వాడిన పేస్టు వ్యర్ధ పదార్ధమై డ్రైనేజీ వ్యవస్థతో మళ్ళీ సముద్రంలో కలుస్తుంది.  అంతేకాదు ప్లాస్టిక్ తయారీలో కూడా చాలా హానికారకమైన కెమికల్స్ వాడతారు. ఎందుకంటే ప్లాస్టిక్ నిప్పు ధాటికి తట్టుకోవడం కోసం.  దాదాపు మనం రోజు వాడే ప్రతి ప్లాస్టిక్ లోను ఈ కెమికల్స్ ఉంటాయన్నది నిజం. ప్లాస్టిక్ అనేది మన నోటి ద్వారానే కాదు అనంత వాయువుల కూడా మన శరీరంలోకి చేరుతున్నాయన్నది నిర్వివాదాంశం. ముఖ్యంగా ప్లాస్టిక్ మన శరీరంలో కి వెళితే చాలా అనర్ధాలే వస్తాయి. ప్రధానంగా బ్రెస్ట్ క్యాన్సర్, ఆస్తమా, సంతానలేమి ఇలా ఎన్నో వున్నాయి.

       ప్లాస్టిక్ గురించి ఎంతమంది ఎన్నిరకాలుగా చెప్పినా దాని పరిశ్రమలు ఇప్పటికీ నడవడం గమనార్హం. ప్లాస్టిక్ పరిశ్రమలు ఆపడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ పెద్ద పెద్ద అవినీతి కుంభకోణాలతో నీరుకారిపోతున్నాయి. ఇప్పటికీ ప్లాస్టిక్ రహస్య ప్రదేశాలలోనే తయారవుతోంది. వాటి పరిశ్రమల జాడ కూడా సరిగ్గా ఎవరికీ తెలియదు. అందుకే ఇప్పటికీ ప్లాస్టిక్ లో వాడే కెమికల్స్ గురించి కాని వాటి తయారీ విధానం గురించి సరైన సమాచారం లభించడంలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్లాస్టిక్ తయారీలో పదేళ్ళ సమయానికి గాను దాదాపు 11 పదార్ధాలు మాత్రమే కనుక్కోగలిగారు. కాని అవే పదార్ధాలు సుమారు ఓ లక్షకు పైగా వుండవచ్చని అంచనా. అంటే ఈ విషాన్ని ఆపే పరిస్థితి లేదనే అనుకోవచ్చు.

       తన దాకా వస్తే తెలియదన్నట్టు ఇప్పుడు ప్రతి దేశం ప్లాస్టిక్ నిషేధం వైపు అడుగులేస్తోంది. నష్టాన్ని నివారించే ప్రయత్నంలో ప్రత్యమ్నాయం వైపు నిశితంగా పరిశీలిస్తోంది. ముందుగా ప్లాస్టిక్ వ్యర్ధ పదార్ధాలకు వేదికైన సముద్రగర్భాన్ని యంత్రాలతో , చేపల వేటకు ఉపయోగించే నావలతో మరికొన్ని సాధనాలతో శుద్ధి చేయడం ప్రారంభించారు. ఈ ప్రయత్నంలో భాగంగానే ధృడమైన ప్లాస్టిక్ ను ఒక దగ్గర చేర్చి భూమి మీదనే భూస్థాపితం చేస్తున్నారు. ఇలా ఎన్నో రకాలుగా ఈ ప్లాస్టిక్ మహమ్మారిని దూరం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి.

       ఎవరో వస్తారని ఏదో చేస్తారని కూర్చోడం కాకుండా ఈ ప్లాస్టిక్ బారి నుండి కాపాడుకోవడానికి మీరే ఒక ప్రయత్నం ఇప్పటినుండే చేయవచ్చు. ఎలాగంటారా... మీరు నిత్యావసరాలకొరకు దుకాణాలకు వెళ్ళినపుడు ప్లాస్టిక్ రహిత వస్తువులనే ఎంచుకోండి. అంతేకాక వాడేసిన ప్లాస్టిక్ వ్యర్ధ పదార్ధాలను చెత్త బుట్టలో వేయడం మరిచిపోకండి. అలానే ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులతోనే కాక మీ బంధుమిత్రులతో కూడూ పంచుకోండి. గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు తీసుకోబోయే ఈ నిర్ణయం మిమ్మలనే కాదు భవిష్యత్తులో మీ తరతరాలను కాపాడుతుంది.


plastic-pollution
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Harikrishna Inturu a 20 year professional media journalist, His writings endeavor with a satirical ting for any type of articles. His pen name is well known as VISHAYA VIMARSAKUDU