ఆ ఊరు సముద్ర తీరానికి కూత వేటు దూరంలో ఉన్నా.. నీరు మాత్రం మధురంగా ఉంటుంది. సాధారణంగా సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో లభించే నీరు ఉప్పగా ఉంటుంది.
తాగేందుకు అనువుగా ఉండదు. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తి భిన్నం.
విశాఖ జిల్లా , యారాడలో లభించే నీరు అన్నంత తియ్యగా ఉంటుంది. అంటున్నారు అక్కడి ప్రజలు. 

ఆ ఊరి వారికి నీటి సమస్య అన్న మాటే లేదు. ఏడాది పాటు కావాల్సినంత నీరు ఉంటుంది. సాగర తీరపు సొబగుల నడుమ పచ్చదనాన్ని పరుచుకున్న యారాడ ప్రాంతం నీటి సంరక్షణతో ఆదర్శంగా నిలుస్తోంది. విశాఖ నగరానికి సమీపాన అలల సోయగాల మధ్య ఉండే ప్రాంతం యారాడ. ఈ పేరు వింటే పర్యావరణ ప్రేమికులు మైమరచిపోతారు.

అంతటి సుందరమైన ఈ తీర ప్రాంతంలో తాగు నీటి సమస్య అనే ప్రశ్నే రాక పోవడం విశేషం.
 '' యారాడలో 1500 మందికి పైగా నివాసం ఉంటున్నారు. బావుల్లోని నీటిని కుళాయిల ద్వారా ప్రతి ఇంటికి సరఫరా చేస్తున్నారు. ఆ నీటిని తాగు, సాగు అవసరాలకు వాడుతుంటారు. నీటిలో ఏ విధమైన ఉప్పు లక్షణాలు కన్పించవని.. అన్నింటికి ఈ నీటినే వినియోగిస్తామని...'' స్థానికుడు నారాయణ అంటున్నారు.

 నీటి బొట్టును ఒడిసి పట్టడంతో వర్షం కురిసినప్పుడు ప్రతి నీటిబొట్టును భూమిలోకి ఇంకిపోయేలా యారాడలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాం. ఫలితంగా వేసవిలో పుష్కలంగా నీరు దొరుకుతుందని...'' లక్ష్మి అనే స్ధానికురాలు చెబుతున్నారు.
ఇక్కడి బావుల్లో నీటిలో మినరల్స్‌ పుష్కలంగా ఉండటంత వల్ల నీటికి రుచి వచ్చిందని పర్యావరణ వేత్తలంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: