Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Aug 21, 2019 | Last Updated 6:52 am IST

Menu &Sections

Search

Success- రైతమ్మ జీవితం మారింది!!

Success- రైతమ్మ జీవితం మారింది!!
Success- రైతమ్మ జీవితం మారింది!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రైతమ్మ జీవితం మారింది!!
కొత్లాపూర్‌(తాండూరు మండల్‌)లో ఒక ఎకరం పదికుంటల భూమి తప్ప వేరే ఆస్తులేమీ లేవు వెంకటప్పకు.సకాలంలో వానలు లేక ఆ నేలలో ఏం పండించాలో తెలయక ఆందోళన పడసాగాడు. బతుకు తెరువుకు మరో దారి లేక తెలిసినోళ్ల దగ్గర అప్పులు చేసి పొలంలో బోరు వేశాడు.కూరగాయలు పండించి కుటుంబాన్ని పోషించాలనుకున్నాడు.
నీళ్లయితే పడ్డాయి కానీ బోరు చెడిపోయింది,మోటారు కాలిపోయింది.వెంకటప్ప పరిస్థితి మళ్లా మొదటికి వచ్చింది. కన్ను మూసినా తెరిచినా బోరు కోసం చేసిన రూ.80వేల బాకీ కనిపిస్తోంది. అప్పులిచ్చినోళ్లు వెంటపడుతున్నారు. భార్య బుజ్జమ్మకు సంగతి చెప్పి భోరుమన్నాడు... సంక్రాంతి పండుగ రోజున ఎవరికీ చెప్పకుండా పొలానికి వెళ్లిన వెంకటప్ప మళ్లా తిరిగిరానిలోకాలకు వెళ్లి పోయాడు.వికారాబాద్‌ జిల్లా రైతుల ఆత్మహత్యల లిస్టులో అతడి పేరు కూడా చేరింది. బుజ్జమ్మ,తన ఇద్దరు బిడ్డలతో దిక్కులేనిదయింది.
ఇంట్లో తిండికి గడవని పరిస్థితి, భర్త చేసిన అప్పులు ,పొదుపు సంఘంలో అప్పులు ఆమెను అతలా కుతలం చేశాయి.భర్త ఎక్స్‌గ్రేషియా కోసం అధికారుల చుట్టూ తిరిగీ తిరిగీ అలసి పోయిన ఆమెకు కిసాన్‌ మిత్ర హెల్ప్‌లైన్‌ పోస్టర్‌ కనిపించింది. ఆఖరి ఆశగా వారికి ఫోన్‌ చేసింది. గంటలోనే ఆమె గుమ్మం ముందు 'కిసాన్‌ మిత్ర' కార్యకర్త సంగమేష్‌ ప్రత్యక్షమయ్యాడు. ఆమెకు భవిష్యత్‌ గురించి కాస్త నమ్మకం కలిగించాడు.
బైండ్ల బుజ్జమ్మ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఆ పేద మహిళ కన్నీటి గాథ కలెక్టర్‌ దివ్యను కదిలించింది. ఆమెను కలెక్టర్‌ ఆఫీసుకు రప్పించి, రూ.5లక్షల ఎక్స్‌ గ్రేషియాను బుజ్జమ్మ పేర బ్యాంకులో డిపాజిట్‌ చేసి 3 నెలలకోసారి వడ్డీ వచ్చేలా ఏర్పాటు చేశారు.

''మాకు డబుల్‌ బెడ్‌రూం ఇంటిని కూడా మంజూరు చేస్తామన్నారు.కూతురు నికితకు రెసిడెన్షియల్‌ స్కూల్‌లో సీట్‌ ఇప్పించారు.ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డు ఇచ్చారు. దిక్కులేని మా కుటుంబానికి కలెక్టరమ్మ వెలుగును చూపించారు. కిసాన్‌ మిత్ర మా సమస్యలన్నీ తీర్చింది '' అని సంతోషం నిండిన స్వరంతో జిన్‌గుర్తిలో మాతో చెప్పింది బుజ్జమ్మ. 
.....................................

ఆదిలాబాద్‌, వికారాబాద్‌ జిల్లాలో ' కిసాన్‌ మిత్ర 'టోల్‌ ఫ్రీ నెంబర్‌..1800.120.3244 
..................................


women-farmer
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.