హైదరాబాద్ వ్యాపారవేత్త సానా సతీష్ ను ఈడీ అధికారులు ఢిల్లీ లో అరెస్టు చేశారు. దాదాపుగా మూడున్నర సంవత్సరాల విచారణ తర్వాత ఇడి సానా సతీష్ ను అర్రెస్ట్ చేసింది. మటన్ వ్యాపారి మొయిన్ ఖురేషీ మనీ లాండరింగ్ కేసులో సానా సతీష్ ను అరెస్టు చేశారు . సీబీఐ అధికారులకు లంచం ఇచ్చి, సమల నుండి తప్పించుకోవాలని చూశాడని సతీష్ పై ఆరోపణలున్నాయి .


రెండు వేల పదిహేడులో మొయిన్ ఖురేషీ వ్యాపారాలపై కేసు నమోదు చేశారు ఈడీ అధికారులు . మాంసం ఎగుమతుల పేరుతో సతీష్ మనీ లాండరింగ్ కు పాల్పడినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ కేసులో సీబీఐ మాజీ డైరెక్టర్ ఏపీ సింగ్ ను సైతం విచారించారు . ఈడీ అధికారులు సీబీఐ అధికారులకు లంచం ఇచ్చి, సమల నుండి సతీష్ తప్పించుకోవాలని ప్రయత్నించాడని ఆరోపణలున్నాయి . 


ప్రకంపనలు సృష్టించిన సీబీఐ డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ బదిలీల వ్యవహారంలో సతీష్ వాంగ్మూలం, కీలకంగా మారిందని తెలుస్తోంది. నెంబర్ 2 స్థానం లో ఉన్న రాకేష్ ఆస్తనాకు లంచం ఇచ్చి, సమల్ల నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించాడని సతీష్ పై ఆరోపణలున్నాయి . రాకేష్ ఆస్తానా రెండు కోట్ల లంచం అడిగారని సతీష్ ఆరోపించారు. ఇపుడు సతీష్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకంపనలు సృష్టించింది. సానా సతీష్ వాంగ్మూలం, సీబీఐ లో అంతర్గత కుమ్ములాటలకు కూడా కారణమైంది . ఇటు సతీష్ అరెస్ట్, రాకేష్ ఆస్థానా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.దీనితో ఆస్థానాకు ఆందోళన మొదలైంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: