గుంటూరు జిల్లా జానపాడుకు చెందిన యువకుడు మలేషియాలోని జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడని కథనాలు ప్రసారం కావడంతో ఏపీ హోంమంత్రి సుచరిత స్పందించారు. ఈ ఘటన పై విచారణ జరిపి బాధితుడికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీని పై విచారణకు ఆదేశించామన్నారు. పై అధికారులతో చర్చించి యువకుడ్ని భారత్ కు రప్పించే ఏర్పాట్లు చేస్తామన్నారు.దీనిపై ఆవిడ మట్లాడుతూ.."విజిటింగ్ వీసా మీద వెళ్లిన వాళ్లు మరెక్కడ పని చేయకూడదు అని చెప్తా ఉన్నారు.


దాని మీద ఇద్దరు అరెస్టు అయ్యారని తెలిసింది.దాని గురించి మాట్లాడి విచారణ చేసి న్యాయం చేయటం జరుగుతుంది. వీసా రూల్స్ ప్రకారం విజిటింగ్ కోసం వెళ్లినవాళ్ళు అక్కడ వర్క్ చేయకూడదు, మరి వీళ్ళు అ రూల్ తెలిసో, తెలియకో మరి అక్కడ వాళ్ళు వర్క్ చేయడం జరిగింది. దాని వలన అరెస్ట్ కావడం జరిగిందని చూశాం. దాన్ని ఏ విధంగా మాట్లాడి పరిష్కరించాలి అన్నది ఆలోచించి చేయడం జరుగుతుంది". మలేషియా జైలులో శిక్ష అనుభవిస్తున్న నరసింహారావును స్వామి అయ్యప్ప అనే ఏజెంట్ మలేసియా పంపించినట్టు తెలుస్తుంది దీంతో స్వామి అయ్యప్ప మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు లోకొస్తున్నాయి. గతంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొందరు యువకులను మలేషియాకు పంపించినట్టు తెలుస్తుంది.వారిలో కొందరు మూడు నెలల పాటు శిక్ష అనుభవించి మళ్లీ తిరిగి వచ్చారు.


స్వామి అయ్యప్పని కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు. దీనిపై మెంబర్ ఆఫ్ పార్లమెంట్ 'బాలశౌరి' ఇలా స్పందించారు. "పొద్దున నేను టీవిలో చూశానండి. యాక్చ్యువల్ గా అది మా ప్లేసేనండి పిడుగురాళ్ల ఆ నరసింహారావు అనేటువంటి అతను, ఎవరో మధ్య లో ఉన్నటువంటి ఒక మధ్యవర్తి ద్వారా మలేషియా వెళ్లి ఉద్యోగమిప్పిస్తామని చెప్పేసి టచ్ లో ఉంటాడని చెప్పేసి విన్నాను.ఇది చాలా బాధ కరం, తప్పకుండా దానిమీద నేను ఆల్ రెడీ ఒక లెటర్ కూడా ప్రిపేర్ చేశాను. ఈ రోజు నేను అలాగే నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు వాళ్ళతో కృష్ణదేవరాయల ఇద్దరం కూడా కలిసి మన ఎక్స్ టర్నల్ ఎఫైర్ మినిస్టర్ వివేక్ జయశంకర్ గారితోటి కలిసి ఈ విషయంని ఇమీడియేట్ గా మన భారత రాయబారి తరపున అక్కడే తీసుకెళ్లి ఇమీడియెట్ గా అతన్ని రిలీజయ్యేటట్టుగా చూస్తాం.

ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం చాలా మంది అమాయకులు ఎంతమంది ఈ మధ్యవర్తులు, బ్రోకర్ల మాటలు నమ్మేసి వాళ్ళ జీవితాలన్ని పాడుచేసుకుంటా ఉన్నారు. ఈ విషయం మీదా కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీద వుంది. నేను హోంమినిస్టర్ తో కూడా మాట్లాడతాము అలాగే ఈ విషయాన్ని సంబంధించినటువంటి స్టేట్ లెవల్ లో అధికారులతో కూడా మాట్లాడి ఎవరైతే ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాల కోసం ప్రలోభానికి లోనై వాళ్ళ జీవితాలను పాడుచేసుకొని విదేశాలకెళ్లి జైల్లో ఉంటున్నారో, వీటన్నిటి మీదకూడా ఒక చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైన తప్పకుండా ఈ రోజు మేము ఎక్స్ టర్నల్ ఎఫైర్స్ మినిస్టర్ గారిని కలిసి మరీ ఆపైన త్వరగా రిలీజ్ అయ్యే విధంగా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను."అని ఆయన అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: