నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అడవుల జిల్లా ఆదిలాబాద్ తడిసి ముద్దయింది. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. పంటలకు తెగుళ్ళు బారిన పడే ప్రమాదముందని రైతులు లబోదిబోమంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ఆదిలాబాద్ జిల్లాలో వేల హెక్టార్ లలో పంట పొలాలు నీట మునిగాయి. మోకాళ్ల లోతు నీరు చేరింది. పెనుగంగ, ప్రాణహిత పరివాహక ప్రాంతాల లోని పత్తి, సోయా పంటల్లోకి వరద నీరు చేరడంతో రైతులు కుదేలవుతున్నారు.


పంటలు తెగుళ్ల బారిన పడే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. అధిక వర్షాలతో నష్ట పోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.ఎడతెరిపి లేని వర్షం కారణంగా పంటలు మొత్తం నేలమట్టం అయ్యాయి.పంటలు తెగుళ్ళ బారిన పడటం వల్ల పెట్టిన పెడుబడులు వెనక్కి రాకపోగా నష్టాల్లో కూరుకుపోతారని రైతులు ఆందోళన చెందుతున్నారు.దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయే రైతులను ఆదుకోవటానికి ముందడుగు వేస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: