యుప్ టీవి యాజమాన్యం పేద విద్యార్థుల చదువు కోసం ముందడుగు వేసింది. ''బ్రైట్ లైఫ్' పేరుతో ఓ సామాజిక వేదికను ఏర్పాటు చేసింది. కరీంనగర్ జిల్లా వీణవంకలో జరిగిన కార్యక్రమంలో యుక్తి వ్యవస్ధాపకుడు మరియు సీఈవో ఉదయ్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన పెద్ద కుమారుడు అద్వైత్ పాల్గొన్నారు. ఆర్థికంగా వెనకబడిన పిల్లలకు, ప్రతి నెలా ఆర్థిక సాయం అందిస్తారు. ప్రతి నెలా వెయ్యి రూపాయల నుంచి పదిహే ను వందల రూపాయల వరకూ సాయం అందుతుంది.


ఈ డబ్బుతో పిల్లలు వారి అక్కర నిమిత్తం వినియోగించుకోవచ్చు. ట్యూషన్ ఫీజులు, పుస్తకాల కోసం ఈ డబ్బును ఖర్చు పెడతారు. అంతర్జాతీయంగా ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. త్వరలోనే లైఫ్ ఆరు కు పేరుతో ప్లాట్ ఫామ్ ను ప్రారంభించనున్నట్టు తెలిపారు.  యుప్ టీవీ ఫౌండర్, సిఇఒ ఉదయ్ రెడ్డి.ఈ నేపధ్యం లో ఆయన మాట్లాడుతూ.  వీణవంక గ్రామంలో ఎకనామికల్లీ బ్యాక్ వర్డ్ స్టూడెంట్స్ కి ప్రతీ నెల 1200 రూపాయలు ఇస్తామన్నారు.



ఆ గ్రామంలో ఇప్పటికే 30 మందిని దత్తత తీసుకున్నట్లు ఆయన తెలిపారు. దీనికంటే ముఖ్యమైనదేంటంటే ఒక టీమ్ హైదరాబాద్ లోను అమెరికాలో ఒక పోర్టల్ "brightlife.com" అనే పోర్టల్ ను తయారు చేశారని, దాన్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు, విద్యార్థిలను ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా గాని అడ్వటైజ్ చేసి వారి ద్వారా స్పాన్సర్ షిప్ చేసే పద్ధతిలో ఇది డిజైన్ చేశామని అన్నారు.ఈ ప్రోజెక్ట్  రెండు మూడు నెలల్లో మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: