దేశంలో అక్రమ రవాణాలు ఉదృతంగా జరుగుతున్నాయి.ఐతే ఇరాన్ లో అత్యధికంగా ఇది జరగటం అంతే కాక ఇరాన్ ప్రభుత్వం దానిని పసిగట్టి పట్టుకోవటం గమనార్హం.అక్రమ రవాణాలను పసిగట్టి ఇరాన్ ప్రభుత్వం పట్టుకోవటం ఇది మూడవసారి.ఈ నేపధ్యంలో ఇటీవలే అక్రమంగా ఆయిల్ రవాణా చేస్తుందన్న ఆరోపణలతో గల్ఫ్ లో మరో ఓడను స్వాధీనం చేసుకుంది ఇరాన్.ఫార్సీ ఐర్లాండ్ సమీపంలో ఈ ట్యాంకర్ ను ఆ దేశ రివల్యూషనరీ గార్డ్స్ సీజ్ చేసినట్లు ప్రకటించింది స్థానిక మీడియా.




ఆ ఓడలో ఏడు లక్షల లీటర్ల అక్రమ చమురు ఉందని, అందులో ఉన్న ఏడుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. నెల రోజుల వ్యవధిలో ఇరాన్ విదేశీ ట్యాంకర్ లను పట్టుకోవడం మూడోసారి. దీంతో టెహ్రాన్, అమెరికా మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.దీంతో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగవన్న పరిస్థితి నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: