కృష్ణా జిల్లా అవనిగడ్డలో దారుణం జరిగింది. ముక్కుపచ్చలారని ఓ బాలుడిని కిరాతకంగా అంతమొందించారు.రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో కనిపించాడు. బీసీ సంక్షేమ హాస్టల్ లో ఈ హత్య జరిగింది. చల్లపల్లి బీసీ హాస్టల్ లో ఆదిత్య అనే బాలుడు మూడో తరగతి చదువుతున్నాడు. ఏం జరిగిందో తెలియదు తెల్లవారేసరికి హాస్టల్ బాత్ రూమ్ ముందు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. హాస్టల్ వార్డెన్ పోలీసులకు సమాచారమందించారు.ఒక బీసీ సంక్షేమ హాస్టల్ లోకి వెళ్లి అభం, శుభం తెలియని చిన్నారిని చంపాల్సిన అవసరం ఎవరికుంది.




హాస్టల్ లో ఉన్న బాలుడిని ఇంత దారుణంగా హత్య చేశారంటే దీని వెనుక కక్షలు ఉన్నాయా, లేదంటే తోటిపిల్ల మధ్య చోటు చేసుకున్న వివాదమా. ఈ కేసు వ్యవహారం పోలీసులకు ఒక సవాల్ గా మారింది.  మూడో తరగతి చదువుతున్న దాసరి ఆదిత్య హత్య కేసు మాత్రం చాలా మిస్టరీగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆదివారం రోజు ఇంటికి వెళ్ళి సోదరుడితో,తల్లిదండ్రులతో కలిసి గడిపాడు.ఎందుకంటే వాళ్ళ ఊరు కూడా చల్లపల్లే కాబట్టి.నిరుపేద కుటుంబం కావడంతో పేరెంట్స్ పిల్లలిద్దరిని కూడా బీసీ సంక్షేమ హాస్టల్ లో వేయటం జరుగుతుంది.




మూడో తరగతి చదువుతున్నటువంటి ఆదిత్యా సోమవారం ఉదయమే హాస్టల్ కి వచ్చాడు. రాత్రి పడుకునేటప్పుడు అందరితో కలిసి మాట్లాడటం జరిగిందని తోటివిద్యార్థులు చెప్తున్నారు. పదకొండు గంటల సమయంలో దాసరి ఆదిత్యతో పాటు మరొక విద్యార్థి ఇద్దరు కూడా బాత్రూంకి వెళ్ళటానికి లేచారు. అయితే ముందుగా ఒక విద్యార్థి వెళ్ళి వచ్చి నేను పడకుంటా అని చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందనేది  మాత్రం మిస్టరీగా ఉంది.హాస్టల్ బాత్ రూమ్ దగ్గర విగతజీవిలా రక్తపు మడుగులో ఉన్నటువంటి దాసరి ఆధిత్యను ఉదయం పిల్లలు చూసి ఒక్కసారిగా షాక్ కు గురవటం కూడా జరిగింది.




వార్డెన్ కు అదేవిధంగా వాచ్ మేన్ కి కూడా సమాచారం ఇచ్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హాస్టల్లో అంతమంది విద్యార్థులు ఉన్నారు,వాచ్ మేన్ ఉన్నా కూడా ఈ దారుణం జరుగుతున్నప్పుడు వీళ్ళందరు ఏమి చేస్తున్నారనే దానిని అయితే పోలీసులు కనుగునే విషయంలో ఉన్నారు. అంటే విద్యార్థుల మధ్య గొడవలు జరిగాయా, లేకుంటే కుటుంబ కలహాల నేపధ్యం ఈ హత్య జరిగి ఉంటుందా మరేదైనా కారణమై ఉంటుందా అనే ఆలోచనలో ఉన్నారు. చల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: