అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంతటా వర్షాలు కురుస్తున్నాయ్.అయితే,వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది ఉత్తర ఒడిస్సా బెంగాల్ తీరాలను ఆనుకుని బంగాళాఖాతం మీదగా కొనసాగుతుంది. తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికాలు వెల్లడించారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో వరుసగా నాలుగు రోజులు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వివరించారు.వాయుగుండం నిన్న బాలాసూర్ కు ఆగ్నేయంగా నూట అరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.



ఇది శుక్రవారం మధ్యాహ్నం బాలాసూర్ కు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పలుచోట్ల ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం ధాటికి కోస్తాంధ్రాలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖాధికారులు  తెలుపుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: