ధర్మవరం పట్టణానికి చెందిన వ్యక్తి  ఓ కేసులో రిమాండ్‌ ఖైదీగా నెల రోజుల పాటు ధర్మవరం సబ్‌జైలు పాలయ్యాడు. కానీ జైల్‌లో ఎటువంటి ఇబ్బంది లేకుండా వీలుగా సౌకర్యార్దమై జైలు ఉన్నతాధికారితో రూ.50వేలకు ఒప్పందం కుదర్చుకున్నాడు. అంతే ఇంకేముంది ప్రతీరోజూ బిర్యానీ, లిక్కర్‌లను జైలులోనికి అనుమతించారు. వాట్సాప్‌ ద్వారా కుటుంబ సభ్యులతో ప్రతి రోజు జైలు నుండే సదరు ఖైదీ సంభాషణలు జరిపాడు. నేరం చేసి రిమాండ్‌లో ఉన్న ఖైదీకి ఇంట్లో కంటే చాలా మంచి సౌకర్యాలనే జైలు అధికారులు కల్పించారు.

అయతే ఇదే ధర్మవరపు మండలానికి చెందిన మరో వ్యక్తి కేసు విషయంలో 25రోజుల రిమాండ్‌కు ధర్మవరం సబ్‌జైలుకు వచ్చాడు. సదరు ఖైదీ కుటుంబ సభ్యులు ములాఖత్‌ కోసం జైలుకు వస్తే ఒక్కొక్కరితో రూ.1000లు వసూలు చేశారు. మా దగ్గర డబ్బులు లేవు సార్‌.. అంటూ వారు అడగగా కనీసం రూ.500 లైనా ఇవ్వాల్సిందేనని జైలు అధికారులు దౌర్జన్యం చేశారు. ఇక చేసేదెం లేక ముడుపు చెల్లించి తమవారిని కలుసుకున్నారు.

ఈ ధర్మవరం సబ్‌జైలు.. ఓ వైపు డబ్బున్న వారికి లాడ్జిలాగా మారుతుంటే..,, నిరుపేద ఖైదీలకు మాత్రం సబ్‌జైలులో వసూళ్ల పర్వం చూసి జడుసుకుంటున్నారు. జైలులో పని చేస్తున్న ఉన్నతాధికారి ధనధాహానికి సిబ్బంది వారు బలవంతంగైన సరే వసూల్ కార్యక్రమం చేశారు. చేసిన నేరం కంటే సబ్‌జైలులో వాతావరణమే ఎక్కువ బాధగా మారిందని ఆవేదనకు లోనయ్యారు.
సాధారణంగా జైలులో ఆదివారం, పండుగ రోజులలో సెలవు ఉంటుంది. ఈ సమయాల్లో బయట వారిని ములాఖత్‌కు అనుమతించరు. మిగతా రోజుల్లో నియమిత సమయాలలో అనుమతిస్తారు..,, అయితే ములాఖత్‌కు వచ్చిన కుటుంబ సభ్యులు జైలు సిబ్బందికి లోపలికి వెళ్లగానే రూ.1000లు ముట్టజెప్పాల్సి ఉంది. డబ్బులు ఇవ్వక పోతే ఖైదీని పిలిచే పరిస్థితి లేదు. ఇలాంటి స్థితికి ప్రజలే తగు చరమగీతం పడాలి మరి..  చట్టం ముందు అందరూ ఒకటే కదా...

మరింత సమాచారం తెలుసుకోండి: