రెండు కుటుంబాలను కలిపే బంధమే ప్రేమంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెద్దలు ఏడు అడుగులు వేయించి.ఒక్కటిగా చేసే ఈ బంధాన్ని పెళ్లి అంటారు.అది ఒక్కక్కరు ఒక్కో విధంగా వారి వారి సంప్రదాయాలకు తగట్టు పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు.వివాహం అయిన తర్వాత భర్త అడుగులో అడుగేస్తూ నడిచేది భార్య. మన భారతీయ సమాజంలో భార్యభర్తల సంబంధం ఏడు జన్మల సంబంధంగా,ఏడు పుణ్యాల ఫలంగా పరిగణించబడుతుంది. ఈ ఒక్క విషయంతో వివాహానికి మన దేశంలో ఎంత ప్రాధాన్యత ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అబ్బాయిలు మరియు అమ్మాయిలు వారి జీవితంలో పెళ్లి అయిన తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఈ వివాహ జీవితంలో ప్రేమ, గౌరవం మరియు నమ్మకాన్ని కొనసాగించిన నాడే ఈ ప్రయాణం చాలా సులభం అవుతుంది. లేకపోతే దాని గురించి చాలా మందికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే అందుకు సంబంధించిన కథలు మనం ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూశాం. కొన్ని ప్రత్యక్షంగా చూశాం. చూస్తున్నాం కూడా. అందుకే మీకు ఇలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా ఉండాలంటే మీకు కూడా మంచి లక్షణాలున్న వ్యక్తి దొరికితే, ఆ వ్యక్తిని అదృష్టవంతులుగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసుకునే మహిళల్లో ఏయే లక్షణాలు ఉండాలో తెలుసుకోండి. భర్తగా మారి సంతోషకరమైన జీవితాన్ని పొందండి.1).అనుకువతనం,2)కలుపుకోలుతనం,3)సమయస్ఫూర్తి,4)ఆప్యాయతలు,5)నిర్వహణా విధానం,6)అప్రమత్తత,7)కోపం రాని తనం. ఈ ఏడు గల వ్యక్తులు జీవితంలో ఎంతో అన్యోయంగా ఆనందంగా ఉంటారని ప్రముఖులు,అనుభవజ్ఞులు చెప్తున్నారు. పెళ్లి అనేది సృష్టి కార్యం అని అందుకే అంటారు.అంచేత జీవితంలో పెళ్లి ఒక్కసారె జరుగుతుంది.కాబట్టి ఆచు తూచి చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: