కాలేజ్ విద్యార్థులకు సెక్స్ పాఠాలు చెప్పిందని, వారిని వ్యభిచార ఉచ్చులోకి దింపాలని వెలుగు చూడటంతో అరెస్టు అయిన తమిళనాడులోని అరుప్పుకోటై మహిళా కాలేజ్ మాజీ ప్రొఫెసర్ నిర్మలాదేవి శ్రీ విల్లిపుత్తూరు జిల్లా మహిళా కోర్టులో హఠాత్తుగా స్పృహతప్పి కుప్పకూలిపోయారు.


 మహిళా కాలేజ్ అమ్మాయిలకు లైంగిక ఎర వేసిందని ప్రొఫెసర్ నిర్మలా దేవిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు . ప్రస్తుతం శ్రీ విల్లిపుత్తూరు మహిళా కోర్టులో ఈ కేసు విచారణలో ఉంది.
మదురై కామరాజర్ యూనివర్శిటీలోని కొందరు పెద్దలకు లైంగిక సుఖం ఇస్తే మీకు పరీక్షలో ఎక్కువ మార్కులు వేసి పాస్ చేస్తారని, మీరు విలాసవంతమైన జీవితం గడపటానికి మీ బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేస్తారని, ఈ విషయాలు చాలా రహస్యంగా ఉంటాయని అరుప్పుకోటై మహిళా కాలేజ్ అమ్మాయిలకు ప్రొఫెసర్ నిర్మలా దేవీ సెక్స్ పాఠాలు చెప్పారని కేసు నమోదైయ్యింది.
కాలేజ్ విద్యార్థులకు నిర్మలా దేవి సెక్స్ పాఠాలు చెప్పిన ఆడియో టేప్ లు బయటకు రావడంతో అవి వైరల్ అయ్యాయి. కాలేజ్ అమ్మాయి కొందరు దైర్యంగా ముందుకు వచ్చి నిర్మాలా దేవి భాగోతం మొత్తం పోలీసులకు చెప్పారు.


గత కొన్ని నెలల క్రితం దేశ వ్యాప్తంగా నిర్మలా దేవి వ్యవహారం చర్చకు దారి తీసింది.కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు చెప్పిన ప్రొఫెసర్ నిర్మలా దేవితో సహ మురుగన్, పీహెచ్ డీ విద్యార్థి కరుప్పస్వామిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఎక్కడ నిర్మలా దేవిని కాపాడితే ఈ కేసు తమ మెడకు చుట్టుకుంటుందో అనే భయంతో వారు చివరికి వెనక్కి తగ్గారు.


కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు చెప్పారని అరెస్టు అయిన నిర్మలా దేవి శ్రీవిల్లిపుత్తూరు జిల్లా మహిళా కోర్టులో జరిగే వాయిదాలకు హాజరు అవుతున్నారు. కోర్టు విచారణకు నిర్మలా దేవితో పాటు మురుగన్, కురుప్పు స్వామి హాజరైనారు.న్యాయమూర్తి కేసు విచారణ చేస్తున్న సమయంలో నిర్మలా దేవి కోర్టులో కుప్పకూలిపోయింది


మరింత సమాచారం తెలుసుకోండి: