తెలుగు టీవి యాంకర్లు అనగానే మనకు గుర్తొచ్చేది ముందుగా సుమ, అనసుయ, రష్మిలే.స్మాల్ స్క్రీన్ ని దున్నేస్తున్నారు. అయితే వీళ్లతో పోటా పోటీగా ముందుకు సాగుతోంది యాంకర్ విష్ణుప్రియ. బుల్లితెర అందాల యాంకర్ విష్ణుప్రియకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. పోవే పోరా ప్రోగ్రాతో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా బుల్లితెరమీదకు అడుగులేసింది. ఇకపోవే పోరా షో ద్వారా సుధీర్‌తో విష్ణు కెమిస్ట్రీ అద్భుతమని చాలా మంది కూడాఅంటుంటారు. వీరిద్దరూ కలిసి ఈ షోలో చేసే డ్యాన్స్ కుర్రకారుకును భలే హిటెక్కిస్తుంది. అంతలా డ్యాన్సుల్లో ఇద్దరూ రెచ్చిపోయి కెమిస్ట్రీ పండిస్తుంటారు. ఇదిలా ఉంటే.. ఈటీవీ ఛానెల్ లో పండుగలకు మల్లెమాల సంస్థ ప్రత్యేకమైన ప్రోగ్రామ్ లు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 31వ తేదీన కూడా ఆడవారి పార్టీలకు అర్థాలే వేరులే అనే పేరుతో ప్రత్యేకమైన కార్యక్రమం ప్రసారం చేసి సంగతి తెలిసిందే. వర్షిణి, రోజా, హైపర్ ఆది, జానీ మాస్టర్, సుధీర్, విష్ణు ప్రియ, జాఫర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరదాగా సాగిపోతున్న ఈ ఈవెంట్లో మాత్రం విష్ణుప్రియ ముక్కును మాత్రం దారుణంగా టార్గెట్ చేశారు. ముఖ్యంగా ఆమె ముక్కుపై అనేర రకాలుగా పంచులు వేసి ఓవర్ యాక్షన్ చేశారనే చెప్పాలి. ప్రోగ్రామ్ విషయానికి వస్తే.. మొత్తం ఓ వెకిలి.. వెక్కిరింపు ప్రహసనం నడించింది.
ఎందుకంటే ఈ ప్రోగ్రామ్‌లో విష్ణుప్రియ ముక్కు మీదే పంచులు, సెటైర్లు, చేసిన వెకిలి వ్యాఖ్యలు కనీసం వందసార్లైనా ఉండి ఉంటాయి. దీంతో ఒక్కో సందర్భంలో పాపం విష్ణుప్రియ నవ్వడం ఆపేసి చేతులతో ముక్కును కవర్ చేసుకుంది. మరోవైపు వర్షిణి కూడా ఎప్పుడూ నవ్వనంతగా విష్ణుపై పంచులు వేస్తుంటే పడి పడి నవ్వింది. ఓవర్ ఆల్గా చెప్పాలంటే.. షో మొత్తం బాడీ షేమింగ్ నడిచింది. వాస్తవానికి విష్ణు ముక్కు మరీ అంత దారుణంగా అయితే ఉండదు. అలా ఉండుంటే ఈ రంగంలోకి ఎలా వస్తుంది.. ఇక ప్రోగ్రామ్ చివరిలో జాఫర్ ఎంట్రీ ఇచ్చి.. సీరియస్‌గా మార్చేసినట్టు చేసి మళ్లీ కామెడీ రూట్లోకి వచ్చేసి ప్రోగ్రామ్‌ను ముగించారు.