ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షో ఎంత పెద్ద హిట్టయిందో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. మొదట్లో కేవలం జబర్దస్త్ తో ప్రసారం అయిన ఈ షో మంచి టాక్ ని , టీఆర్పీని సంపాదించుకొని ఎక్స్ ట్రా జబర్దస్త్ ను కూడా మొదలుపెట్టి దూసుకుపోతుంది.  ఈ షో ద్వారా పరిచయం అయిన హాస్యనటులు ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా నటిస్తున్నారు. ఇంకొందరు ఏకాంగా హీరోలే అయ్యారు. ఇక జబర్దస్త్ కామెడీ షో చూసేవాళ్లకు చమ్మక్ చంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ స్కిట్స్ చేయడంలో ఈయనకు తిరుగులేదు. 

 

ఎంతమంది ఉన్నా కూడా చంద్ర స్కిట్ వచ్చిందంటే చాలు అది మరో స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు ఆయన ఆ షో మానేసాడు అయినా కూడా ఇప్పటికీ ఎప్పటికీ చంద్ర అంటే కేరాఫ్ జబర్దస్త్ అంటారు అభిమానులు. ఇదిలా ఉంటే.. చమ్మక్‌చంద్రకు సంబంధించిన రెమ్మ్యూనరేషన్ వ్యవహారం బయటకొచ్చింది.  జబర్దస్త్ నుంచి తన కేరాఫ్ అడ్రస్ అదిరిందికి మార్చుకోడానికి చంద్ర ఏకంగా డబుల్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోలో ఈయనకు కాల్షీట్ కోసం దాదాపు 3 లక్షల వరకు చెల్లించేవారని.. అలాంటి నాలుగు కాల్షీట్స్ నెలకు ఉండేవని తెలుస్తుంది. 

 

అలాంటిది ఇప్పుడు జీ తెలుగులో మాత్రం అదిరింది కోసం ఒక్కో కాల్షీట్ కోసం దాదాపు 5 లక్షల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అంతే డ‌బుల్ రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. అలాగే ఈయనకు డబుల్ రెమ్మ్యూనరేషన్ ఇవ్వాలని నాగబాబు కూడా రికమండ్ చేశారని ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తోంది. కాగా, చంద్ర.. టీవీ షోలకే పరిమితం అవలేదు. సినీ రంగంలోనూ అతడు తన మార్క్‌ను చూపించాడు. అ ఆ, అరవింద సమేత, ఎక్కడికి పోతావు చిన్నవాడ, రాజా ది గ్రేట్, టాక్సీవాలా సహా ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటనను కనబరిచాడు.

  


 

మరింత సమాచారం తెలుసుకోండి: