తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంక‌ర్ ప్ర‌దీప్. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న చేసిన షోస్ అన్నీ దాదాపు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఒక్క పెళ్లిచూపులు మాత్ర‌మే ఆయ‌న ఇమేజ్ తీసేసింది.. కానీ మిగిలిన‌వ‌న్నీ ఆయ‌న‌కు మంచి ఇమేజ్ తీసుకొచ్చాయి. బుల్లితెర హిస్టరీలో యాంకరింగ్‌లో తనదైన ముద్రను వేస్తున్న ప్రదీప్ మాచిరాజు ఒకడు. తెలుగు రాష్ట్రాల్లో అతడికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నేళ్లుగా ఎన్నో టీవీ షోలకు యాంకరింగ్ చేస్తూ టీవీ రంగంలో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అతడు చాలా షోలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు.

 

ఇదిలా ఉంటే.. ఢీ షోలో పాత్రలు, పాత్రధారులు మారిపోతున్నాయి. స్టార్టింగ్ నుంచి సుడిగాలి సుధీర్, రష్మీ అలాగే కొనసాగుతున్నప్పటికీ యాంకర్ విషయంలో మాత్రం క్లారిటీ ఉండట్లేదు. ఎప్ప‌టినుంచో యాంకర్ ప్రదీప్ ఈ షో నిర్వ‌హిస్తుండ‌గా.. ఈ మ‌ధ్య కాలంలో ఆ ప్లేస్ లో యాంకర్ రవి ఎంట్రీ ఇచ్చాడు. అయితే అతడు కూడా ఎగ్జిట్ అయిపోవడంతో మరోసారి ప్రదీప్ రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ఢీలోకి ప్రవేశించిన హైపర్ ఆది, వర్షిణి మొదట్లో కాస్త తడబాటుకు గురైనప్పటికీ తర్వాత తర్వాత బాగానే పుంజుకుంటున్నారు.

 

అయితే  యాంకర్ ప్రదీప్ హైపర్ ఆదికే పంచులతో గుక్క తిప్పుకోనివ్వకుండా ఇబ్బంది పెట్టినట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ వ‌స్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో హైపర్ ఆది ఫ్యాన్స్ ప్రదీప్ ను టార్గెట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. వాస్త‌వానికి జబర్దస్త్ స్టేజి పై ఎంతో పేరొందిన హైపర్ ఆది, ఢీలో కాస్త వీక్ అయినట్లే కనిపించాడు. అయితే అటు జబర్దస్త్‌తో సంబంధం లేని యాంకర్ ప్రదీప్ ప్రస్తుతం మరో చానెల్ లో ఇదే తరహా ప్రోగ్రామ్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. దీంతో అతడి ప్లేస్ లో ఢీ షోలో జబర్దస్త్‌ కమెడియన్ ను హోస్ట్ గా తెస్తే ఎలా ఉంటుందని టీమ్ యోచించినట్లు సమాచారం. ఈ నేప‌థ్యంలోనే చలాకీ చంటి పేరు పెండింగ్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: