బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు షో చూసిన వారంద‌రికి రాహుల్, పునర్నవి ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేర్లు. ఎందుకంటే ఈ సీజన్ ఆధ్యంతం రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని చెప్పాలి.  ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని నెట్టింట్లో ఊహాగానాలు కూడా వినిపించాయి. అంతేనా.. వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారనీ, త్వరలో పెళ్లి చేసుకుంటారని గాసిప్స్ కూడా పుట్టుకొచ్చాయి. అప్పట్లో నాగార్జున కూడా వీరిద్దరిని ఈ విషయంలో సరదాగా ఒక ఆటాడుకున్నాడు. అయితే వీటిని కొట్టిపారేసిన రాహుల్, పునర్నవీ తమ మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని కొట్టిప‌రేశారు.

 

అంత క్లారిటీగా చెప్పినా వాళ్లిద్దర్నీ చూసి ప్రేక్షకులకు ఎక్కడో ఏదో డౌట్ అలాగే ఉండిపోయింది. ఇప్పటికీ వాళ్ల మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందనే చాలా మంది అనుకుంటున్నారు. ఇక ఈ షో తరువాత బిజీ అయిపోయిన వీరిద్దరూ తమ కెరీర్ పై దృష్టి సారించారు. రాహుల్ కెరీర్ ప్రస్తుతం పీక్స్‌లో ఉంది. అటు సింగర్ గానే కాకుండా అటు నటుడిగా అవకాశాలు సొంతం చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే..  రాహుల్ ఇటీవల పునర్నవి పేరెంట్స్ ను కలిసాడు. ఆ ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ కూడా చేసాడు. అయితే ఎందుకు క‌లిసాడు అన్న ప్ర‌శ్న రానేవ‌చ్చుంటుంది. 

 

విన్నర్‌గా గెలిచిపించిన అభిమానుల కోసం తాను, పునర్నవి కలిసి ఓ ప్రైవేట్ ఆల్బమ్ చేస్తామని అప్పట్లో ప్రకటించిన రాహుల్. ప్రస్తుతం ఆ ఆల్బమ్ పర్మిషన్ గురించి పునర్నవి పేరెంట్స్ ను కలిసినట్టు తెలిపాడు. ఈ ఆల్బమ్ లో పునర్నవి నటించబోతోన్నట్లు తెలుస్తోంది. ఇక ప్ర‌స్తుతం దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’లో రాహుల్ అవకాశం కొట్టేసాడు రాహుల్‌. ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాతో రాహుల్‌ నటుడిగా వెండితెరకు పరిచయం కానున్నారు. అయితే ఈ సినిమా యూనిట్ నటీనటులకు ఓ పార్టీ ఇచ్చారు. ఈ వేడుకలో రాహుల్‌తోపాటు పునర్నవి కూడా పాల్గొని.. పాట పాడుతూ డ్యాన్స్‌ కూడా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: