జబర్దస్త్ కామెడీ షో ద్వారా అందరికీ పరిచయం అయిన సుడిగాలి సుధీర్... తన స్కిట్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇపుడు పెద్ద పెద్ద షోలకు యాంకరింగ్ చేస్తూ మంచి పొజిషన్‌కు వచ్చాడు. అలాగే సుడిగాలి సుధీర్‌కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అతడు కామెడీ ఆర్టిస్టే అయినా.. గర్ల్స్ ఫాలోయింగ్ బీభత్సంగా ఉంటుంది. అందుకే.. సుధీర్ ఏ షో చేసినా ప్రధాన పాత్ర కచ్చితంగా అతడిదే ఉంటుంది.  టీవీ షోలతో పాటు యాంకర్, డాన్సర్, మెజీషియన్‌గా కూడా సత్తా చూపిస్తున్నాడు సుధీర్. ఈ మధ్యే సాఫ్ట్‌‌వేర్ సుధీర్ అంటూ హీరో అయ్యాడు కూడా. 

 

అయితే ఈ చిత్రం ఊహించినంత స‌క్సెస్ అవ్వ‌లేక‌పోయింది. అయిన‌ప్ప‌టికీ ఈయ‌న‌కు ఏ మాత్రం క్రేజ్ త‌గ్గ‌లేదు.  ఒకే షోకు మళ్లీ మళ్లీ వచ్చినా బోర్ కొట్టనివ్వడు. తన నటనతో ప్రేక్షకులకు కావాల్సినన్ని నవ్వుల్ని పంచుతాడు. తాను తిట్లు తినిపించుకొనైనా, బకరా అయినా సరే.. ప్రేక్షకులు నవ్వుకోవాలన్నదే సుధీర్ సూత్రం. ఇక ప్ర‌స్తుతం జబర్దస్త్ టీమ్‌లో పెళ్లికి మోస్ట్ ఎలిజిబుల్ ఆర్టిస్ట్ సుధీరే. పెళ్లి ప్రస్తావన వస్తే చాలు.. ఆమడ దూరం పారిపోతాడు. కెరీర్‌లో ఇంకా పైకి ఎదగాలని, ఎన్నో ఆశలు ఉన్నాయని చెబుతుంటాడు. ఇక దీన్ని అదనుగా తీసుకొని తోటి ఆర్టిస్టులు సుధీర్‌పై జోకులు పేల్చుతుంటారు. 

 

నీ కామానికి ఎంతమంది బలి కావాలిరా!.. నీ కోరికలకు అంతే ఉండదారా! అంటూ కామెంట్లు చేస్తూనే ఉంటారు. కాని, అవే సుధీర్‌కు ప్ల‌స్ అవుతాయి. ఇదిలా ఉంటే.. వచ్చే వారానికి సంబంధించిన ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ ప్రోమోలో ఓ కీలక సన్నివేశం చోటుచేసుకుంది. మాస్ అవినాష్ వేసిన స్కిట్‌లో భాగంగా.. అవినాష్‌ను రోజా తిడుతుంది. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు మేడం అలా తిట్టకండి అనగానే.. నీకు, సుధీర్‌కు జన్మలో పెళ్లి కాదు అంటూ శాపం పెడుతుంది. దానికి సంబంధించిన సన్నివేశం విప‌రీతంగా పేలింది. సుధీర్ పేరు ఎత్త‌గానే అక్క‌డ ఉన్న‌వాళ్లంద‌రూ షాక్‌లో గ‌ట్టి గ‌ట్టి న‌వ్వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: