యాంకర్ సుమ.. ఈ పేరుకు తెలుగు ప్రేక్షకులకు విడదీయరాని అనుబంధం ఉంది. రెండు దశాబ్ధాలుగా ఈమె బుల్లితెరపై అద్భుతాలు చేస్తూనే ఉంది. ఎందరు కుర్ర యాంకర్లు వచ్చినా సీనియర్ యాంకర్ సుమకు ఉండే క్రేజే వేరు. బుల్లితెరపై, ప్రీరిలీజ్ ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్స్ ఎక్కడా చూసిన సుమ మాట‌లే వినిపిస్తుంటాయి.  వయసు 40 దాటినా కూడా ఇప్పటికీ యాంకరింగ్‌లో ఆమెను అందుకునే శక్తి కానీ.. దాటే అర్హత కానీ ఎవరికీ కనిపించడం లేదు. రోజుకో కొత్త యాంక‌ర్ వ‌చ్చి.. గ్లామ‌ర్ షోలు కూడా చేస్తున్న ఈ స‌మ‌యంలో ఇంత సుధీర్ఘకాలం కెరీర్ కొనసాగించడం అంటే చిన్న విష‌యం కాదు.

 

కానీ సుమ మాత్రం చేసి చూపించింది. కేర‌ళ నుంచి ఇక్క‌డికి వ‌చ్చి తెలుగు తెలుగ‌మ్మాయిల కంటే స్ప‌ష్టంగా మాట్లాడుతుంది సుమ. రోజుకు ఎనిమిది గంట‌లు నిల్చొని.. అన్ని లైట్స్ మ‌ధ్య‌లో షోస్ చేయ‌డం అంటే చిన్న విష‌యం కాద‌నే చెప్పాలి. ఇక తాజాగా స్టార్ మా లో త్వరలో ప్రసారం కానున్న ‘వైఫ్ చేతిలో లైఫ్’ అనే ఫ్యామిలీ ఇంటర్ టైనర్‌ కార్యక్రమానికి సుమ యాంక‌రింగ్‌గా చేస్తోంది. దీనికి సంబంధించి తాజాగా ఓ ప్రోమో కూడా విడుద‌ల చేశారు. అందులో `భార్యకేనా ఎప్పుడూ ప్రేమను చూపించే అవకాశం.. ఒక్కఛాన్స్ భర్తకు వస్తేనా.. అంటూ భార్యాభర్తలతో ‘అర్ధమౌతోందా?’ అంటూ ప్రోమో కొన‌సాగుతుంది.

 

ఈ ప్రోమోలో ఎంతో అందంగా, సాంప్ర‌దాయంగా క‌నిపిస్తుంది సుమ‌. అయితే ఈ కార్య‌క్ర‌మంపై కొంద‌రు నెటిజ‌న్లు త‌మ శైలిలో కామెంట్లు పెట్టారు. ఈ నేప‌థ్యంలోనే కొత్తవాళ్ళని ఎంకరేజ్ చెయ్యండి అక్కా అంటూ కామెంట్ చేస్తుంటే.. కొంద‌రు పాసిటివ్‌గా స్పందిస్తున్నారు. అలాగే మ‌రికొంద‌రు ఫ్లాప్ షో.. ఏదైనా ఇంట్ర‌స్టింగ్‌గా చేయ‌మంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇటీవ‌ల కాలంలో.. ప్రతీ ఛానెల్ వారు సుమ‌తోనే కొత్త కొత్త షోలు ప్రారంభించడం వంటివి చేస్తుండడంతో ఇంకెంత కాలం ఈమెనే చూడాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మ‌రి ఈ నెగిటివిటి మ‌ధ్య సుమ‌క్క ఈ `వైఫ్ చేతిలో లైఫ్` కొత్త షో ఎంత వ‌ర‌కు వ‌ర్కోట్ అవుతుందో.. లేదో.. తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: