కార్తీక దీపం సీరియల్ తెలుగులో అత్యంత ప్రజాదరణతో దూసుకువెళ్తోన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అతి తక్కువ టైంలో చాలా పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ సీరియల్‌. ముఖ్యంగా ఈ సీరియల్ ద్వారా తెలుగు ఆడపడుచుల్లో ఒక్కరిగా దీప అలియాస్ వంటలక్క మారిపోయింది. ఈ దీప పాత్రను పోషించిన అమ్మాయి పేరు ప్రేమి విశ్వనాథ్. గత మూడేళ్లుగా స్టార్ మాలో ప్రసారమవుతూ మరే ఏ సీరియల్ కూడా అందనంత టీఆర్పీని సొంతం చేసుకొని నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది.

 

ఇక ఇప్ప‌టికే ఎన్నో ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న కార్తీకదీపం ప్రస్తుతం ఒక కీలక దశకు చేరుకుంది. అలాగే చిన్నా.. పెద్దా.. ఆడ.. మగా అందరూ.. సోమవారం నుంచి శనివారం వరకూ.. రాత్రి 7:30 అయ్యిందంటే టీవీలకు అతుక్కుపోయేలా చేస్తుంది కార్తీకదీపం. వంటలక్క విశ్వరూపానికి మిగతా సీరియల్స్ ఏవీ దరిదాపుల్లో కూడా లేకపోవడంతో బుల్లితెర బాహుబలిగా మారిపోయింది ఈ సీరియల్. అయితే ఇప్పుడు ఈ సీరియల్ కి గ‌ట్టి పోటిగా 'ఇంటింటీ గృహలక్ష్మీ' అనే సీరియల్ రంగంలోకి దిగింది. ఈ సీరియల్ లో ఒకప్పటి నటి కస్తూరి మెయిన్ లీడ్ లో నటిస్తుంది. మంచి కుటుంబం కథ, విలువలతో వస్తున్న ఈ సీరియల్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. 

 

ఈ సీరియల్ ఇప్పుడు భారీ స్థాయి ఆదరణను సొంతం చేసుకుంటుంది అని తెలుస్తుంది.సరిగ్గా “కార్తీక దీపం” సీరియల్ తర్వాతే కావడం అందులోను సరికొత్త సీరియల్ కావడం దీనికి మరింత ప్లస్ అవుతుందని తెలుస్తోంది. అయితే మ‌రోవైపు  ఈ సీరియల్ కాన్సెప్ట్ పైనే నెటిజన్లు మండిపడుతున్నారు.ఓ తల్లి పాత్రను ఈ విధంగా చూపిస్తారా అని ఈ సీరియల్ తో వీక్షకులకు వారి టీం అసలు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని మండిపడుతున్నారు. వాస్త‌వానికి ఇలా స్టార్ మా ఛానెల్లో ఏ సీరియల్ కు జరగలేదని చెప్పాలి. మరి ముందు రోజుల్లో ఈ ధారావాహకను ఎలా నడిపిస్తారో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: