టీవీలో రొమాంటిక్ పెయిర్ ఎవరంటే కచ్చితంగా సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ అని చెప్పేస్తారు చాలా మంది. అయితే వీరి త‌ర్వాత ఎవ‌రైనా ఉన్నారా అంటే అది కేవ‌లం యాంక‌ర్‌ అనసూయ, హైపర్ అది జోడినే. గత కొద్దికాలంగా వీరిరువురి మధ్య షోల్లో రొమాంటిక్ సంభాషణలు నడిచి వీక్షకులకు కిక్ ఇస్తున్నాయి. వాస్త‌వానికి అందం ముందు హీరోయిన్ కూడా ప‌నికిరాదు. చిట్టిపొట్టి దుస్తులు ధ‌రించి వ‌య‌స్సు ఏ మాత్రం క‌నిపించ‌కుండా స్టెప్పులు వేస్తూ ముద్దు ముద్దు మాట‌ల‌తో యాంక‌రింగ్ చేస్తూ అద‌రగొట్టేస్తుంటుంది. తన గ్లామర్, చలాకీతనంతో అనసూయ తిరుగులేని పాపులారిటీ సొంతం చేసుకుంది. అనసూయ యాంకర్ గానే కాదు.. నటిగా కూడా వెండితెరపై బిజీ ఈమె. 

 

ఈ మేరకు అటు సినిమాల్లో నటిస్తూనే ఇటు జబర్దస్త్ వేదికపై కూడా రాణిస్తోంది అనసూయ. ఇక ఎలా చూసుకున్న అన‌సూయ‌కు, హైపర్‌ ఆదికి ఆకాశం, నేలకు ఉన్నంత తేడా ఉంటుంది. కానీ తన ప్రతీ స్కిట్ కోసం అనసూయను వాడేస్తుంటాడు ఆది. అసలు అనసూయ లేనిదే స్కిట్ లేదన్నట్లు ప్రతి స్కిట్‌లో అనసూయను, లేదా ఆమె పేరుతో ఓ పాత్రను సృష్టించి స్కిట్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. ప్రేక్షకులు కూడా ఆది స్కిట్లకు బాగా నవ్వుతుండటం.. అనసూయ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఆది అనసూయ జపం చేస్తున్నాడని సోషల్ మీడియాలో సౌతం నెటిజన్లు కోడై కూస్తున్నారు.

 

అలాగే అనసూయను వాడుకోవ‌డంతో స్కిట్‌కు మ‌రింత‌ హైప్ క్రియేట్ అవుతుంది. దీంతో స్కిట్ హిట్ అవుతంది.  సాధారణంగానే ఆది పంచ్‌లకు కడుపుబ్బా నవ్వుకునే జనం.. అనసూయ గ్లామర్, గాసిప్స్ తోడవడం ఆది స్కిట్లకు మంచి రేటింగ్స్ తీసుకొస్తున్నాయని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ప‌క్కా ప్లానింగ్‌తో.. ప్ర‌తి వారం అన‌సూయ సక్సెస్ ఫార్ములాతోనే వెళ్లిపోతున్నాడు ఈయన. ఇక అప్పుడప్పుడూ ఆది స్కిట్స్ కోసం వేసే పంచులు.. రాసుకునే డైలాగులు బయట కూడా బాగానే పాపులర్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: