కార్తీక దీపం సీరియల్ తెలుగులో అత్యంత ప్రజాదరణతో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సీరియ‌ల్ ద్వారా తెలుగు ఆడపడుచుల్లో ఒక్కరిగా దీప మారిపోయింది. ఈ దీప పాత్రను పోషించిన అమ్మాయి పేరు ప్రేమి విశ్వనాథ్. ఒక మామూలు వంటలక్కకి, సున్నితమైన డాక్టర్ బాబుకి మధ్యలో వచ్చిన మనస్పర్థలు.. విడిపోయిన ఆ జంటను కలపాలని చూస్తున్న చిన్నారులు, పెద్దరికంతో కోడల్ని సానుభూతితో అర్థం చేసుకున్న అత్తగారు.. ఎలాగైనా వంటలక్కకి డాక్టర్ బాబుతో విడాకులు ఇప్పించి పెళ్లాడాలనుకుంటున్న మరదలు పిల్ల ఎత్తులు.. ఇంతే! దీని చుట్టూ గిరా గిరా తిరిగేస్తూ మహిళా ప్రేక్షకులనే కాదు.. మగ మహారాజుల్ని కూడా తన చుట్టూ తిప్పేసుకుంటోంది కార్తీకదీపం సీరియల్.

 

 సాయంత్రం 7గంటల 30నిమషాలకు అయితే చాలు అందరూ కూడా మాటీవీ ముందే అతుక్కుపోతున్నారు. మూడేళ్లుగా న‌డుస్తున్నీ  కార్తీకదీపం సీరియల్ దెబ్బకు బుల్లితెరపై రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. ఇక తాజాగా జ‌రిగిన ఎపిసోడ్ ఓ ఆస‌క్తిక‌ర సంగట‌న జ‌రిగింది. ఈ ఎపిసోడ్‌లో దీప‌ను కార్తీక్ కారులో ఎక్కించుకుంటారు. ఈ క్ర‌మంలోనే దీప కారు ముందు సీట్‌లో కూర్చోవడానికి డోర్ తీస్తుంది. అయితే కార్తీక్ వెనుక కూర్చో అని అంటాడు. దానికి కోపంగా చూస్తూ ఏం కాదా డాక్టర్ బాబు? అంటుంది. అయితే దీప కోపాన్ని అద్దంలోంచి గమనించిన కార్తీక్.. ‘ఏదో రోజు రాత్రి వచ్చి.. ఆ కనుబొమ్మలని కత్తిరించుకుని పోతాను దించు...’ అంటాడు.

 

అప్పుడు ఇవి నా సెల్ఫ్ రెస్పెక్ట్‌కి అసలు సిసలైన తార్కాణం.. నా ఆత్మగౌరవం ఇలాగే తలెత్తుకుని నిలబడుతుంది.. హూ అంటూ తల తిప్పుకుంటుంది దీప. ఆ వెంటనే.. కాస్త ముందుకు వంగి.. ఏసీ పెంచుకుని, పక్కనే ఉన్న కల్లజోడు అందుకుని.. పెట్టుకుంటుంది. కాలు మీద కాలు వేసుకుని కారు ఓనర్‌లా బిల్డప్ కొడుతుంది. దీప ఠీవీగా కుర్చున్న తీరు చూస్తే అచ్చు ఓనర్‌లానే అనిపిస్తుంది. ఆ సీన్ అంతా అద్దంలోంచి చూసిన కార్తీక్ వెంటనే కారు ఆపి.. దిగవే దిగు.. ముందురా ముందుకు వచ్చి కూర్చో అంటాడు. దాంతో దీప తనలో తనే నవ్వుకుంటూ ముందుకు వచ్చి కూర్చుని.. ‘దటీజ్ దీపా’ అంటుంది. ఆ సీన్ చాలా కామెడీగా ఉంటుంది. అలాగే ఇది చూసిన ప్రేక్ష‌కులు కూడా ద‌టీజ్ దీపా అంటున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: