బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్.. గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం బుల్లితెర నుంచి వెండితెరపైకి ఎంట్రీ ఇస్తున్నాడు యాంకర్ ప్రదీప్ మాచిరాజు. వాస్తవానికి బుల్లితెరపై ఇప్పటి వరకు ఈయన చేసిన షోస్ అన్నీ దాదాపు సూపర్ హిట్ అయ్యాయి. ఒక్క పెళ్లిచూపులు మాత్రమే ఆయన ఇమేజ్ తీసేసింది.. కానీ మిగిలినవన్నీ ఆయనకు మంచి ఇమేజ్ తీసుకొచ్చాయి. యాంకర్ ప్రదీప్ మాచీరాజు హీరోగా తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ . ఎస్వీ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎస్వీ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మున్నా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రదీప్ సరసన అమ్రిత హీరోయిన్గా నటిస్తున్నారు.
ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్లను ఇటీవల రానా దగ్గుబాటి ఆవిష్కరించారు. అలాగే ఈ చిత్రం నుంచి మొట్టమొదటి పాట “నీలి నీలి ఆకాశం”ను సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన ఈ పాటకు చంద్రబోస్ గారు సాహిత్యం అందించారు. సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించగా ఫిమేల్ లిరిక్స్ ను సీనియర్ గాయని సునీత ఆలపించారు. ఇక ఈ పాటలో ఓ అమాయకమైన పల్లెటూరి పేద కుర్రాడిగా ప్రదీప్ మాచిరాజు ఒదిగిపోయారు. ఇదిలా ఉంటే.. ఈ పాటకు ఇప్పుడు యూట్యూబ్ ద్వారా అక్షరాలా 50 మిలియన్ వ్యూస్ వచ్చి పడ్డాయి.
ఈ విషయాన్ని ప్రదీప్ తన అభిమానులతో ఎంతో ఆనందంగా పంచుకున్నారు. జనవరి 31 న లహరి మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్లో ఈ పాటను విడుదల చెయ్యగా ఇప్పటి వరకు అందులో 40 మిలియన్ వ్యూస్ మరియు 5 లక్షల 70 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.అలాగే గత రెండు వారాల క్రితం టి సిరీస్ తెలుగు యూట్యూబ్ ఛానెల్ లో ఇంకో 10 మిలియన్ వ్యూస్ వచ్చేసాయి. ఇలా ఈ పాట ఇప్పుడు ప్రదీప్ కెరీర్ లో బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ గా నిలవడంతో.. ఈయన మరియు ఈయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా.. ప్రదీప్ అలా దూసుకుపోతున్నాడేంటి అని ఆశ్యర్యపోతున్నవారూ ఉన్నారట.